NTV Telugu Site icon

Sudheer babu: కార్తీక సోమవారం ‘హరోం హర’ నినాదం

Harom Hara

Harom Hara

Sudheer babu: నైట్రో స్టార్ సుధీర్ బాబుతో జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. దీన్ని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘సెహరి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన జ్ఞానసాగర్ ద్వారకు ఇది రెండో సినిమా కాగా, సుధీర్ బాబుకు 18వ చిత్రం.

‘అక్టోబర్ 31న మాస్ సంభవం’ అని ఇటీవల ప్రకటించిన చిత్ర బృందం అనుకున్నట్టుగానే ఈ రోజు బిగ్ అప్డేట్ తో వచ్చింది. ఈ చిత్రానికి ‘హ‌రోం హ‌ర‌’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ ను లాక్ చేశారు. ‘ది రివోల్ట్’ అనే ట్యాగ్ లైన్ కూడా వుంది. టైటిల్ ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ, ట్యాగ్‌లైన్ కథలోని ప్రతీకార కోణాన్ని తెలియజేస్తోంది. కాన్సెప్చువల్ టైటిల్ వీడియోలో సినిమా సెట్టింగ్, బ్యాక్‌డ్రాప్, గ్రాండ్ స్కేల్ చూస్తుంటే మూవీ వైవిధ్యంతో తెరకెక్కబోతోందని అర్థమౌతోంది.. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి కథ ఇది. సుబ్రమణ్య స్వామి ఆలయం, జగదాంబ టాకీస్, రైల్వే స్టేషన్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు వీడియోలో చూపించారు. ఈ వీడియో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో సుధీర్ బాబుని ప్రజంట్ చేసింది. “ఇంగా సెప్పేదేం లేదు… సేసేదే…” అని సుధీర్ బాబును చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. టైటిల్ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. చివర్లో సుధీర్ బాబు మాస్ గెటప్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమా కోసం సుధీర్ బాబు కంప్లీట్ గా మేకోవర్ అయ్యానట్టు అనిపిస్తోంది. యానిమేటర్ వేణుమాధవ్ పిక్చర్స్ ను, చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఎలివేట్ చేసింది. ఈ చిత్రానికి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, రమేష్ కుమార్ జి సమర్పిస్తున్నారు.

‘హరోం హర’ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.