బిగ్ బాస్ రియాల్టీ షోలో తన సత్తా చాటిన దివి సినిమాల్లో కొన్ని మంచి ఆఫర్లను దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేయడంతో తన కల నిజమైంది. ఈ మూవీ తనకు గేమ్ ఛేంజర్ అవుతుందని ఆమె ఆశిస్తోంది. ఇంతలో దివి తన తాజా ఫోటోషూట్ తో గ్లామర్ డోస్ పెంచేసింది. ఈ ఫోటోలలో ఆమె నలుపు రంగు చొక్కా, నలుపు జీన్స్ ధరించి కనిపించింది. దివి ఈ దుస్తుల్లో చాలా అందంగా ఉంది. దివి సెడక్టివ్ పోజ్ యూత్ ను రెచ్చగొట్టేలా ఉంది. సినిమాల్లో గ్లామరస్, బోల్డ్ పాత్రలు చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈ ఫోటోల ద్వారా సిగ్నల్ ఇచ్చేసింది దివి. త్వరలోనే ఆమెకు కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు వస్తాయని ఆశిద్దాం.
Read Also : దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు… చిక్కుల్లో హీరోయిన్