Site icon NTV Telugu

Katrina Kaif: కత్రినా దక్కలేదని విక్కీని చంపేస్తానన్న నటుడు.. చివరికి

Katrina Kaif

Katrina Kaif

Katrina Kaif: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కు హత్యా బెదిరింపులు రావడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లు ప్రేమించుకున్న ఈ జంట గతేడాది డిసెంబర్ లో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఇక వివాహం అనంతరం హనీమూన్ ను ముగించుకొని ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అనుకోని విపత్తులా విక్కీని చంపేస్తానంటూ కత్రినాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు రావడం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్ లో ఒక వ్యక్తి కత్రినాకు బెదిరింపు మెసెజ్ లతో పాటు విక్కీ, కత్రినాలను చంపేస్తానంటూ పోస్ట్లు పెడుతూ వేధిస్తున్నాడు. దీంతో విక్కీ వెంటనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీ అడ్రెస్స్ ద్వారా సదురు నిందితుడిని పట్టుకొని షాక్ అయ్యారు. అతడు సాధారణ నెటిజన్ మాత్రమే కాదు నటుడు కూడా అవ్వడంతో అవాక్కయ్యారు. అతడి పేరు మన్వీందర్ సింగ్ అని తెలుస్తోంది.

పలు సినిమాల్లో నటించిన అతడికి కత్రినా అంటే చాలా ఇష్టమని, ఎప్పటికైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉండేవాడని తెలుస్తోంది. అయితే విక్కీ తో కత్రినాపెళ్లి జరగడంతో అది జీర్ణించుకోలేని మన్వీందర్ సింగ్ ఎలాగైనా కత్రినా, విక్కీ లను ఇబ్బంది పెట్టాలని అనుకోని వారికి హత్యా బెదిరింపులు పంపించినట్లు తెలిపాడు. ఇక హత్యా బెదిరింపులుపై కేసు నమోదు చేసుకున్న అతడిని అరెస్ట్ చేశారు. మరోపక్క రిస్క్ తీసుకోవడం మంచిది కాదని, విక్కీ, కత్రినాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా అభిమానులు పోలీసుఅల్ను వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version