Site icon NTV Telugu

Bollywood : బాలీవుడ్ కల్ట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేస్తున్న స్టార్స్

Rimix Songs

Rimix Songs

ఓల్డ్ సాంగ్స్‌కు లేదా ఓ చిన్న ట్రాక్‌ను రీమిక్స్ చేసే కల్చర్ నార్త్ టు సౌత్ ఊపందుకుంటోంది. గత ఏడాది వచ్చిన కె ర్యాంప్‌లో రాజశేఖర్ ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయ మాయ, బాలకృష్ణ సమరసింహారెడ్డిలోని నందమూరి నాయక సాంగ్స్‌లోని ట్రాక్స్‌కు కొంత సేపు స్టెప్పులేసి అదరగొట్టాడు కిరణ్ అబ్బవరం. ఈ చిన్న సీన్‌ను థియేటర్లలో మస్త్ ఎంజాయ్ చేశారు ఆడియన్స్.

Also Read : Sri Vishnu : చురకత్తిలా దూసుకెళ్తున్న శ్రీవిష్ణు

ప్రజెంట్ బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న ధురంధర్‌లో కల్ట్ సాంగ్స్‌ను ఈ జనరేషన్‌కి తగ్గట్లుగా మార్చి సీన్స్ క్రియేట్ చేశారు మేకర్స్. రంభ హో అనే ఓల్ట్ సాంగ్.. యాక్షన్ ఎపిసోడ్స్‌లో చక్కగా వినియోగించారు కంపోజర్స్ శశ్వత్ సచ్ దేవ్, సయంతన్ గుహ. ఇదే కాదు మోనికా ఓ మై డార్లింగ్, హవా హవా సాంగ్ ట్రాక్స్ కూడా వాడేశాడు దర్శకుడు ఆదిత్య ధర్. ఇప్పుడు మారుతి- తమన్ కూడా ఇలాంటి ప్రయోగమే రాజా సాబ్‌లో చేశారు. 1982లో వచ్చిన డిస్కో డ్యాన్సర్ సినిమాలోని కల్ట్ క్లాసిక్ సాంగ్ నాచే నాచే సాంగ్‌ను రాజా సాబ్ కోసం రీమిక్స్ చేశాడు మారుతి. అప్పట్లో అది క్లబ్ సాంగ్ కాగా ఇప్పుడు రొమాంటిక్ సాంగ్‌గా మార్చారు. ఈ జెనరేషన్‌కి తగ్గట్లుగా ట్యూన్ చేసి అదరగొట్టాడు తమన్. డార్లింగ్ స్టెప్స్.. ముద్దుగుమ్మలు మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ గ్లామర్ ట్రీట్స్ అదనపు ఆకర్షణ. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ట్రైలర్స్ ఓ ఎత్తైతే.. ఈ పాట మరో ఎత్తు. బాలీవుడ్‌లో ఓపెనింగ్స్‌కు ప్లస్ అయ్యేట్లుగానే కనిపిస్తుంది. జనవరి 9న థియేటరల్లోకి వస్తున్న ఈ ఫిల్మ్.. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో లెట్స్ సీ.

Exit mobile version