NTV Telugu Site icon

Big Boss Season 6: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్ కపుల్.. అప్పుడు వరుణ్-వితికా జంట.. ఇప్పుడు..?

Bigboss 6

Bigboss 6

BigBoss Season 6: అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని భాషల్లోనూ విజయవంతంగా నడుస్తోంది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్‌లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ఈ షో కోసం నిర్వాహకులు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో మరోసారి స్టార్ కపుల్ అభిమానులను సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో సీజన్-3లో వరుణ్ సందేశ్-వితికా జంట కనువిందు చేసింది. ఇప్పుడు సీజన్-6లో ప్రముఖ సింగింగ్ కపుల్ హేమచంద్ర-శ్రావణభార్గవి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Read Also: Asia Cup 2022: నేటి నుంచే ఆసియాకప్.. టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా ఆరు జట్ల అమీతుమీ

అటు గత మూడు సీజన్‌లుగా హోస్ట్‌గా ఆకట్టుకుంటున్న అక్కినేని నాగార్జున ఆరో సీజన్‌కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఆయనతో స్టార్‌ మా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఉంటారని తెలుస్తోంది. సెప్టెంబర్ 4 ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కాబోతుండగా.. ఫైనల్‌గా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్‌ను వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచినట్లు సమాచారం. ఇప్పటికే జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తున్నట్లు న్యూస్ హల్‌చల్ చేస్తుండగా.. సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డి, హీరో బాలాదిత్య, సీరియల్ నటుడు రోహిత్ సహానీ, యాంకర్ ఇస్మార్ట్ అంజలి కూడా ఈ జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.