Site icon NTV Telugu

Mohan lal : లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను స్టార్ట్ చేసిన స్టార్ హీరో కొడుకు

Pranav

Pranav

మోహన్ లాల్ 65 ప్లస్ ఏజ్‌లో కూడా ఏడాదికి అరడజను సినిమాలు దించేస్తుంటే ప్రణవ్ ఇయర్‌కు ఒక్క సినిమా కూడా తీసుకురావట్లేదు. వర్షంగళక్కు శేషంతో భారీ హిట్ అందుకున్న ప్రణవ్. తర్వాత ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు ఏడాది తీసుకున్నాడు. కెరీర్ కంటే పర్సనల్ లైఫ్‌కు ఎక్కువ ఇంప్టారెంట్ ఇచ్చే ఈ యంగ్ హీరో ఆ మధ్య స్పెయిన్ వెళ్లి గొర్రెలు కాస్తూ వార్తల్లో నిలిచాడు. స్టార్ డమ్ కన్నా ఇంకా ఏదో ఉందని బిలీవ్ చేసే  ప్రణవ్ మోహన్ లాల్ ఇప్పుడు మరో మూవీని షురూ చేశాడు.

Also Read : Prabhas : రాజాసాబ్.. షూటింగ్ రీస్టార్ట్.. గెట్ రెడీ రెబల్స్

ఎంపురన్‌లో టీనేజ్ ఖురేషి పాత్రలో క్యామియో అప్పీరియన్స్ ఇచ్చిన ప్రణవ్ హీరోగా తన నెక్ట్స్ మూవీని లైన్లో పెట్టాడు. భూతకాలం, బ్రహ్మయుగంతో ఫ్రూవ్ చేసుకున్న రాహుల్ సదాశివన్‌తో వర్క్ చేస్తున్నాడు. గత ఏడాది రిలీజైన బ్రహ్మయుగం మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పుడు ఇదే హారర్ థ్రిల్లర్ జోనర్‌లోనే మరో స్టోరీని ప్రిపేర్ చేశాడు డైరెక్టర్ రాహుల్. డైస్ ఇరే అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. మధ్యయుగంలో లాటిన్ కవిత ఆధారంగా ఈ నేమ్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఇప్పటి వరకు లవ్ అండ్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాలకే పరిమితమైన మోహన్ లాల్ సన్ ఫస్ట్ టైం హారర్ థ్రిల్లర్ జోనర్‌లోకి ఎంటర్ కాబోతున్నాడు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరీ ఈ సినిమా తర్వాతైనా ప్రణవ్ వరుస ప్రాజెక్టులు లైన్లో పెడతాడా. థ్రిల్లర్ జోనర్లో ఆరి తేరిన తండ్రిని మించి తనయుడు అనిపించుకుంటాడా లేదా చూడాలి.

Exit mobile version