NTV Telugu Site icon

Karisma Kapoor : తన భర్త గురించి సంచలన వ్యాక్యలు చేసిన స్టార్ హీరోయిన్

Untitled Design (62)

Untitled Design (62)

సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ చూసి మనం కూడా వాళ్ళ లాగా ఉంటే బాగుండు అని అనుకుంటాము. కానీ చాలా మంది సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తాయి కానీ, లోపల మాత్రం వారు చాలా సమస్యలు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. ఒక్కప్పుడు ఇలాంటి అనుభవాలను బయటకు చెప్పుకునే వారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు వారి వేధింపుల గురించి చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా తన జీవితంలో జరిగిన చేదు అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Also Read: Sabdham : ‘శబ్దం’ మూవీ పై మంచు మనోజ్ రివ్యూ..?

ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే కరిష్మా కపూర్.. ఇప్పటి తరం వారికి ఆమె అంటే ఎవరో పెద్దగా తెలియకపోవచ్చు కానీ,1990ల్లో వారికి మాత్రం ఆమె ఓ డ్రీమ్ గర్ల్. తన అందచందాలతో కరీష్మా కపూర్  ఓ ఊపు ఊపేసింది. బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. డ్యాన్స్ లో కానీ అందంలో గానీ హీరోయిన్ లకి గట్టి పోటీ ఇచ్చేది. అలా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే కరీష్మా, సంజయ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లాడింది. కానీ పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే అతనికి విడాకులిచ్చింది.అయితే తాజాగా తన భర్త నుంచి ఆమె ఎందుకు విడిపోయిందో ఇంటర్య్వూలో వివరించింది.

కరిష్మా మాట్లాడుతూ.. ‘ నా భర్త మొదట మంచిగానే ఉండేవాడు కానీ రాను రాను తనలో చాలా మార్పు చూశాను. అసలు ఊహించలేదు. ఎంతకు దిగజారాడు అంటే..తన స్నేహితుల వద్ద నన్ను వేలం వేసేవాడు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వారితో నను ఆ రోజు రాత్రి గడపాలని బలవంతం చేసేవాడు. ఇలాంటి పనులు చేసి నన్ను హింసించేవాడు. వాటిని భరించలేక అతను నుంచి విడాకులు తీసుకున్న’ అంటూ చెప్పుకొచ్చింది.