Darling Prerelease Event: ప్రియదర్శి మరియు నభా నటేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న మ్యాడ్ మ్యాక్స్ మ్యారేజ్ ఎంటర్‌టైనర్ “డార్లింగ్” పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హను-మాన్ సినిమాని అందించిన తర్వాత, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి మరియు శ్రీమతి చైతన్య నిర్మిస్తున్న ఈ మూవీ ని తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, లిరికల్ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అలానే మేకర్స్ కూడా AP మరియు TG అంతటా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ బృందం ఏపీ ప్రమోషనల్ టూర్‌లో ఉంది. దీని తరువాత మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు.
Also Read: Film News: ఒక్క క్లిక్ తో మూడు సినిమాలు..నొక్కి చూస్తే షాక్ అవుతారు..
రేపు(జూలై 15) సాయంత్రం 6 గంటలకు పార్క్ హయత్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేయనున్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ కోసం ముఖ్య అతిథిగ నేచురల్ స్టార్ నాని రానున్నట్లు సమాచారం. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే హీరో(ప్రియదర్శి) చాలా అమాయకుడు, జీవితంలో అతని ఏకైక లక్ష్యం ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పారిస్‌లో హనీమూన్‌కి తీసుకెళ్లడం. అయితే, ఆనంది తన జీవితంలోకి భార్యగా(నభా నటేష్) ప్రవేశించడంతో అతని కలలు చెదిరిపోతాయి. అతని డ్రీమ్స్ ని చెదరగొడుతూ, ప్రతిరోజూ తనకి చుక్కలు చూపిస్తూ, అతన్ని కొడుతుంది..తర్వాత ఏం జరుగుతుంది? అనేది తెలియాకి అంటే మూవీ చుడాలిసిందే. ఇక ఈ మూవీ లో అనన్య నాగళ్ల, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణీ రాజ్ లాంటి నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.