Star choreographer Brinda Master suffered a leg injury while shooting for Kannappa: మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కన్నప్ప టీం నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. కన్నప్ప షూటింగ్‌లో స్టార్ కొరియోగ్రాఫ్గర్ బృందా మాస్టర్ గాయపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సాంగ్ షూటింగ్ అప్పటికప్పుడు నిలిపివేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా షూట్ లో అక్టోబర్ నెలలో మంచు విష్ణు గాయపడగా అప్పట్లో కూడా సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేశారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ కన్నప్ప స్థాయి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే పాన్ ఇండియన్ హీరో ప్రభాస్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్ కుమార్, తమిళ శరత్ కుమార్, మోహన్ బాబు వంటి వారు కన్నప్పలో భాగమైన సంగతి తెలిసిందే. ఇలా ఇంకెన్నో సర్ ప్రైజ్ క్యాస్టింగ్, కన్నప్పలో ఉందని అంటున్నారు.
NTV Film Roundup: పబ్బులో మహేష్, శ్రీ లీల.. యాడ్ ఫిలిం షూట్ లో పుష్ప రాజ్?
ఇక శరవేగంగా షూటింగ్ జరుపుతున్న కన్నప్ప టీంకి ఈ అనుకోని ఘటన ఎదురైందని, సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో బృందా మాస్టర్ కి గాయం అయిందని ఆదివారం నాడు ఈ ఘటన జరుగగా వెంటనే షూట్ నిలిపివేసినట్టు తెలుస్తోంది. హిందీ బుల్లితెరపై మహాభారతం సీరియల్‌లోని కొన్ని ఎపిసోడ్స్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా విభాగంలో పని చేశారు.