టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ అడ్వెంచరస్ చిత్రం (SSMB29) వారణాసి గురించి సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమాలోని మహేష్ బాబు పాత్రలకు సంబంధించి నెట్టింట ఒక వార్త పెద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. ముఖ్యంగా వారణాసి నేపథ్యంలో సాగే ఈ కథలో మహేష్ బాబు ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారని అంటున్నారు. ఈ ఐదు పాత్రలలో ‘రుద్ర’ అనే క్యారెక్టర్ సినిమాకే హైలైట్ అని, ఇదే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. పురాణాల స్ఫూర్తితో సాగే ఈ కథలో మహేష్ బాబు ‘రాముడి’ రూపంలోనూ, ‘శివుడి’ ఛాయలున్న పాత్రలోనూ కనిపిస్తారని అంటున్నారు. అయితే శివుడి పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని టాక్.
Also Read: God of War : ఎన్టీఆర్ – బన్నీ – త్రివిక్రమ్.. అసలేం జరుగుతోంది?
వీటితో పాటు మరో రెండు విభిన్నమైన గెటప్స్ లో కూడా సూపర్ స్టార్ మెరిసి, అభిమానులను థ్రిల్ చేయబోతున్నారని తెలుస్తోంది. వారణాసి షెడ్యూల్‌కు సంబంధించి మరో కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్లో మహేష్ బాబు తన వంతు బాధ్యతను 2026 సమ్మర్ నాటికి పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు. అంటే ఆ సమయానికి వారణాసికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ముగిసిపోతుందని అంటున్నారు. ఇక రాజమౌళి మార్క్ మేకింగ్, మహేష్ బాబు మేకోవర్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయం. ఒకవేళ ఈ ఐదు పాత్రల వార్తే నిజమైతే, వెండితెరపై మహేష్ బాబు విశ్వరూపాన్ని చూడటం ప్రేక్షకులకు కనుల పండగే.