Site icon NTV Telugu

Varanasi :ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు పాత్రల్లో మహేష్ బాబు!

Varanasi Move Mahesh Babu

Varanasi Move Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ అడ్వెంచరస్ చిత్రం (SSMB29) వారణాసి గురించి సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమాలోని మహేష్ బాబు పాత్రలకు సంబంధించి నెట్టింట ఒక వార్త పెద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. ముఖ్యంగా వారణాసి నేపథ్యంలో సాగే ఈ కథలో మహేష్ బాబు ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారని అంటున్నారు. ఈ ఐదు పాత్రలలో ‘రుద్ర’ అనే క్యారెక్టర్ సినిమాకే హైలైట్ అని, ఇదే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. పురాణాల స్ఫూర్తితో సాగే ఈ కథలో మహేష్ బాబు ‘రాముడి’ రూపంలోనూ, ‘శివుడి’ ఛాయలున్న పాత్రలోనూ కనిపిస్తారని అంటున్నారు. అయితే శివుడి పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని టాక్.

Also Read: God of War : ఎన్టీఆర్ – బన్నీ – త్రివిక్రమ్.. అసలేం జరుగుతోంది?

వీటితో పాటు మరో రెండు విభిన్నమైన గెటప్స్ లో కూడా సూపర్ స్టార్ మెరిసి, అభిమానులను థ్రిల్ చేయబోతున్నారని తెలుస్తోంది. వారణాసి షెడ్యూల్‌కు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌లో మహేష్ బాబు తన వంతు బాధ్యతను 2026 సమ్మర్ నాటికి పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు. అంటే ఆ సమయానికి వారణాసికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ముగిసిపోతుందని అంటున్నారు. ఇక రాజమౌళి మార్క్ మేకింగ్, మహేష్ బాబు మేకోవర్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయం. ఒకవేళ ఈ ఐదు పాత్రల వార్తే నిజమైతే, వెండితెరపై మహేష్ బాబు విశ్వరూపాన్ని చూడటం ప్రేక్షకులకు కనుల పండగే.

Exit mobile version