Site icon NTV Telugu

SSMB29: మహేష్- రాజమౌళి సినిమా.. మొదలయ్యేది అప్పుడే.. ?

Mahesh

Mahesh

SSMB29: ఆర్ఆర్ఆర్.. రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. రికార్డులు మోతలు ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఇక కొత్త ఏడాది మొదలై ఆరునెలలు కావొస్తుంది. ఆర్ఆర్ఆర్ లో చేసిన హీరోలు.. తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, దర్శకదీరుడు మాత్రం తన తదుపరి సినిమాను కొంచెం కూడా ముందుకు జరపడం లేదు. ఇది అభిమానుల అసహనం. గతేడాది ఎప్పుడో మహేష్ బాబు తో సినిమా ఉంటుంది అని ప్రకటించారు. అంతే సంగతులు అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమా గురించి వాళ్ళు.. వీళ్ళు మాట్లాడడమే కానీ అధికారికంగా వచ్చిన అప్డేట్ ఒక్కటి లేదు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా..? అని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఇన్నాళ్లకు ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన రానుందట. SSMB29 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు సమాధానం లభించింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 9 న పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నదట.

Prabhas Srinu: నటి తులసితో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ స్నేహితుడు

ఆగస్టు 9.. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రాజమౌళి ఆఫీషియల్ గా తన సినిమాను అనౌన్స్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ విజువలైజేషన్, ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నారని సమాచారం. ఇకపోతే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన దీపికా.. విలన్ గా అమిర్ ఖాన్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన దగ్గరనుంచి మహేష్ అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది అంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడెప్పుడు గాస్ 9 వస్తుందా అని రోజులు లెక్కేస్తున్నారు. మరి దీని అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Exit mobile version