Site icon NTV Telugu

మహేష్ కోసం “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” స్పెషల్ వీడియో

SSMB28 makers unveil heartwarming video as Mahesh Babu Bday Special

ఈ రోజు సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ “సర్కారు వారి పాట” నుంచి రిలీజైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆ టీజర్ నెట్టింట్లో ట్రెండ్ అవుతుండగానే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను ఆవిష్కరించారు.

Read Also : “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అదుర్స్

వీడియో విజువల్స్ “అతడు” సినిమా నుండి వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది. మహేష్ మునుపటి చిత్రాల నుండి తీసిన యాక్షన్, ఎమోషనల్ క్లిప్పింగ్స్ అన్నీ ఒకే దగ్గర చేర్చి ఈ వీడియో తయారు చేశారు. వీడియోలో మహేష్ నిజ జీవితంలో మానవతావాదం కూడా హైలైట్ చేశారు. వికలాంగులతో ఆయన ఉన్న క్లిప్పింగ్‌లు, అవసరమైన పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేయడంలో సహాయపడటం కూడా వీడియోలో చూపించారు. చివరికి “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28″పై ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ప్రత్యేక ప్రకటన రానుందని ప్రకటించారు. ఈ వీడియోను మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

https://twitter.com/haarikahassine/status/1424437762174844928
Exit mobile version