NTV Telugu Site icon

SSMB 28: రేపటి నుంచే కొత్త షెడ్యూల్ షురూ… శ్రీలీలా జాయిన్ అవుతోంది

Ssmb 28

Ssmb 28

అతడు, ఖలేజ లాంటి కల్ట్ సినిమాలని తెలుగు వాళ్లకి ఇచ్చిన త్రివిక్రమ్, మహేశ్ బాబు కలిసి ఇప్పుడు మూడో సినిమా చేస్తున్నారు. రెండు సినిమాలతో అందుకోలేకపోయిన హిట్ ని ఈసారి గ్రాండ్ స్కేల్ లో అందుకోవాలని చూస్తున్నారు ఈ హీరో అండ్ డైరెక్టర్. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగుతోంది. ఇప్పటికే సారధి స్టూడియోలో మహేశ్ బాబుతో ఒక షెడ్యూల్ ని త్రివిక్రమ్ కంప్లీట్ చేశాడు. ఆ షెడ్యూల్ షూటింగ్ సమయంలో సారధి స్టూడియోలో కార్లు పేలిస్తే, అవి మైత్రివనం వరకూ కనిపించాయి… త్రివిక్రమ్ ఈసారి బాబుతో బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడం గ్యారెంటి అనే కామెంట్స్ తో సోషల్ మీడియాలో లీక్డ్ వీడియోలు, ఫోటోలు కనిపించాయి. ఇటివలే షెడ్యూల్ బ్రేక్ రావడంతో మహేశ్ బాబు, ఫారిన్ ట్రిప్ వెళ్లాడు. మహేశ్ అవైలబిలిటీలోకి రావడంతో త్రివిక్రమ్ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చెయ్యనున్నాడు.

Read Also: SSMB 28: బాబు బ్యాండ్ కడితే బాక్సాఫీస్ కి బొమ్మ కనిపించడం గ్యారెంటి

రేపటి నుంచి ఒక హౌజ్ సెట్ లో SSMB 28 షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబుతో పాటు, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్ లు కూడా జాయిన్ అవ్వనున్నారు. యంగ్ సెన్సేషన్ శ్రీలీలా కూడా ఈ షెడ్యూల్ తో SSMB 28లోకి ఎంటర్ అవ్వనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీలతో పాటు మరో బ్యూటీ కూడా SSMB 28లో జాయిన్ అవనుందని సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఈ రూమర్ ప్రకారం… SSMB 28లో బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్‌ను కీలక పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర సెకండ్ హాఫ్‌లో చాలా కీలకంగా ఉంటుందట. అది కూడా పోలీస్ ఆఫీసర్ రోల్ అని, భూమి పడ్నేకర్‌ కూడా ఓకే చెప్పిందని ట్విట్టర్ లో ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.

Show comments