పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడ రచ్చ షురూ అయ్యినట్లే.. రాజకీయలైనా, సినిమాలైనా, సినిమా ఫంక్షన్ అయినా.. వేడుక ఏదైనా.. పవన్ రాకతో అది వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది అనడంలో అతిశయోక్తి కాదు. ప్రస్తుతం పవన్ ఒక పక్క సినిమాలతో.. మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఆయన నటించిన భీమ్లా నాయక్ ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా ‘భీమ్లా నాయక్’ యూనిట్ పెద్ద ఎత్తున సక్సెస్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో మరి ముఖ్యంగా త్రివిక్రమ్ చిత్ర బృందానికి ఇచ్చిన పార్టీ హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ గా మారాయి..
ఇక తాజాగా ఆ పార్టీకి సంబంధించిన వీడియోను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఓ బార్ లో ఈ పార్టీని ఏర్పాటు చేయగా దాదాపు అంతా అంటెడ్ అయ్యి పార్టీని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇక మధ్యలో పవన్ రావడం.. పార్టీకి వన్నె తెచ్చింది. ఇక పవన్ రాకతో రచ్చ షురూ అయ్యింది. త్రివిక్రమ్ తో పాటు పార్టీకి వచ్చినవారందరికి పవన్ ధన్యవాదాలు తెలుపుతూ కనిపించారు. పవన్ తో త్రివిక్రమ్ కి సాన్నిహిత్యం కారణంగానే ‘భీమ్లా నాయక్’ సక్సెస్ పార్టీకి పవన్ హాజరైనట్లు చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
