Site icon NTV Telugu

SS Rajamouli: దైవ చింతనలో రాజమౌళి.. అక్కడి ఆలయాలు అన్నీ చుట్టేస్తున్నాడు!

Ss Rajamouli On Visiting Temples

Ss Rajamouli On Visiting Temples

SS Rajamouli visits Tamil Nadu’s temples: ఆర్‌ఆర్‌ఆర్ హిట్ కొట్టిన ఎస్ఎస్ రాజమౌళి తన తరువాతి సినిమా ప్రారంభించే ముందు కొంత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టున్నాడు. ఈమధ్య యాడ్స్ చేస్తూ కాలం గడపుతున్న ఆయన ఇప్పుడు రోడ్ ట్రిప్‌కి వెళ్లి తమిళనాడు అంతటా ఆలయాలను చుట్టేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమిళనాడులోని అనేక దేవాలయాలను తన కుటుంబంతో కలిసి సందర్శించిన కొన్ని వివరాలను వెల్లడించే ఒక వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి గత నెలలో తన ట్రిప్ నుంచి కొన్ని ఫోటోలను, వీడియోలను వీలాగ్ లా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేస్తూ “చాలా కాలంగా తమిళనాడులో రోడ్ ట్రిప్ చేయాలనుకుంటున్నాను అది పాజిబుల్ అయిందని చెబుతూ దేవాలయాలను సందర్శించాలనుకునే నా కుమార్తెకు ధన్యవాదాలు.

Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య.. ఇప్పట్లో లేనట్టే?

మేము శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వరర్ కోయిల్, రామేశ్వరం, కణదుకథన్, తూత్తుకుడి లాంటి ప్రాంతాలకు వెళ్ళాను. జూన్ చివరి వారంలో మదురై కూడా చూశాం. సున్నితమైన వాస్తుశిల్పం, అద్భుతమైన ఇంజనీరింగ్, పాండ్య, చోళ, నాయకర్లు మరియు అనేక ఇతర పాలకుల లోతైన ఆధ్యాత్మిక ఆలోచనలు నిజంగా మంత్రముగ్ధులను చేశాయి. మంత్రకూడం, కుంభకోణం లేదా రామేశ్వరంలోని కాకా హోటల్, మురుగన్ మెస్‌లో భోజనం ప్రతిచోటా అద్భుతంగా ఉంది. నేను వారంలో 2-3 కిలోలు పెరిగాను. 3 నెలల విదేశీ ప్రయాణం అక్కడి ఆహారం తిన్న తర్వాత, ఈ హోమ్ ల్యాండ్ టూర్ రిఫ్రెష్‌గా అనిపిస్తోంది అని అన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత, SS రాజమౌళి SSMB29 ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబుతో కలిసి పని చేయనున్నారు. “ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్” డ్రామాగా చెప్పబడుతున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ కూడా చేయకుండానే అందరి దృష్టిని ఆకర్షించింది.

Exit mobile version