Site icon NTV Telugu

Rajamouli : క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు రాజమౌళి స్పెషల్ గిఫ్ట్..

Rajamouli

Rajamouli

Rajamouli : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు తెలుగు నాట స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఎప్పటికప్పుడు మన హీరోల సినిమాల డైలాగులతో, సాంగ్స్ తో రీల్స్ చేస్తుంటాడు. ఇక తాజాగా బాహుబలి గెటప్ లో అప్పట్లో ఆయన చేసిన టిక్ టాక్ వీడియోలు, ఫొటోలను మరోసారి షేర్ చేశారు. బాహుబలితో మన తెలుగు ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా ఆయన వేసుకున్న బాహుబలి గెటప్ పై రాజమౌళి స్పందించారు. ‘హలో డేవిడ్.. ఇక నుంచి మీరు మాహిష్మతిలో నిజమైన రాజులా మారిపోండి. మీకు ఆ కిరీటాన్ని నేను గిఫ్ట్ గా పంపిస్తున్నా’ అంటూ రిప్లై ఇచ్చారు.

Read Also : Shivaraj Kumar : నీకు మేమంతా ఉన్నాం.. రమ్యకు శివరాజ్ కుమార్ సపోర్ట్

దానికి డేవిడ్ స్పందిస్తూ.. వెయిట్ చేస్తా అంటూ చెప్పాడు. డేవిడ్ ను ఆస్ట్రేలియాలో బాహుబలి మూవీని చూడాలంటూ మూవీ టీమ్ కోరింది. ఇందుకు సంబంధించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా రానా విలన్ గా నటించిన బాహుబలి తెలుగు సినిమాల్లో ఓ చరిత్ర. ఆ మూవీ తర్వాతనే మన తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. బాహుబలిని అక్టోబర్ లో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్టులను కలిపి ఒకే పార్టులో రిలీజ్ చేస్తున్నారు. ఆ మూవీ వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా ఇలా రిలీజ్ చేస్తున్నారు.

Read Also : Prabhas : పవర్ ఫుల్ గా ఉంది.. మహావతార్ పై ప్రభాస్ ప్రశంసలు

Exit mobile version