SS Rajaomouli: దసరాపై రాజమౌళి ప్రశంసలు.. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావంటూ నానికి కితాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli Praises Dasara Movie And Team: నేచురల్ స్టార్ నాని నుంచి లేటెస్ట్గా వచ్చిన ‘దసరా’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘రా & రస్టిక్’గా ఈ సినిమాని తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. స్టోరీ రొటీన్ అయినప్పటికీ.. ఊర మాస్ కాన్సెప్ట్‌కి మనసుల్ని కరిగించే ఎమోషనల్ టచ్ ఇచ్చి, అదరహో అనిపించాడు. తనకు ఇది మొదటి సినిమానే అయినా.. బాగా అనుభవం ఉన్న దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేశాడు. అతనితో పాటు నాని, కీర్తి సురేశ్‌లు సైతం సహజ నటనతో ఈ సినిమాకి మరింత వన్నె తెచ్చారు. మరీ ముఖ్యంగా.. నాని తన నేచురల్ నటనతో ఈ చిత్రాన్ని తన భుజస్కందాలపై నడిపించాడు. అందుకే.. ఈ చిత్రానికి సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి.
Sai Dharam Tej: విరూపాక్ష ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇప్పటికే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌లు ఈ దసరా సినిమాని పొగడ్తలతో ముంచెత్తారు. ఇదొక స్టన్నింగ్ సినిమా అని, ఈ చిత్రం పట్ల గర్వంగా ఫీల్ అవుతున్నానని మహేశ్ పేర్కొనగా.. ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలంటూ ప్రభాస్ కామెంట్ చేశాడు. ఇప్పుడు తాజాగా దర్శకధీరుడు రాజమౌళి సైతం ఈ చిత్రాన్ని ఆకాశానికెత్తేశాడు. ‘రగ్డ్ ల్యాండ్‌స్కేప్, రా క్యారెక్టర్ల నడుమ.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతి సన్నివేశాన్ని, ముఖ్యంగా ప్రేమకథని ఎంతో హృద్యంగా, అద్భుతంగా తెరకెక్కించాడు. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్తో నాని అదరగొట్టాడు. కీర్తి సురేశ్ ఎప్పట్లాగే తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే తోపు. నటీనటులందరూ తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంతటి గొప్ప విజయం అందుకున్న దసరా టీమ్ కి ప్రత్యేక శుభాభినందనలు’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా జక్కన్న ప్రశంసలు కురిపించాడు.
Rainbow: రెయిన్బోకి ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదు.. ఎవరో తెలుసా?
కాగా.. ఈ దసరా సినిమా శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సమర్పించింది. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చారు. తొలిరోజు నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. కేవలం రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరిపోయింది. ఇప్పటికీ దూకుడు కొనసాగిస్తున్న ఈ సినిమా.. రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకుపోతోంది.
Amidst the rugged landscape and raw characters, Srikanth Odela manages a tender heart touching lovestory. Career best performance by Nani. Keerthy cake walks through her role.
Every actor's performance was note worthy. Cinematography is first class. Special mention to the…
— rajamouli ss (@ssrajamouli) April 3, 2023
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!