టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రంలో SSMB 29 ఇకటి. భారీ అంచనాలతో అడ్వెంచర్ జాన్రాలో వస్తున్న ఈ సినిమా జంగిల్ ఎక్స్‌ప్లోరర్ కథతో, గ్లోబల్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2025లో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్,రిలీజ్ చేయనున్నారు. ‘గ్లోబ్‌ట్రాటర్’ అనే టైటిల్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. అదనంగా ‘Gen 63’ అనే మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రజంట్ OTT ల హవా ఎలా ఉందో చెప్పక్కర్లేదు.
Also Read : Jayam Ravi : ‘దేవుడిని మోసం చేయలేవు’.. జయం రవి టూర్‌పై ఆర్తి కౌంటర్
సౌకర్యం, టైమ్ సేవ్, విభిన్న భాషలలో కంటెంట్ అందుబాటులో ఉండటం వంటివి ప్రధాన కారణాంగా, ప్రేక్షకులు ఎక్కువగా OTT ప్లాట్‌ఫార్మ్‌లలో సినిమాలు చూడటానికి అలవాటు పడుతున్నారు. కానీ సినిమాను థియేటర్‌లో ఆడియన్స్‌తో కలిసి చూడటం ఇచ్చే అనుభూతి మాత్రం వేరే అని పలువురు సినీ ప్రముఖులు అంటుంటారు. అదే విషయాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి గుర్తు చేశారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ..“ఒక ఉదాహరణగా సల్మాన్ ఖాన్ లేదా రజినీకాంత్ ఓపెనింగ్ షాట్‌లో రింగ్‌లోకి వచ్చి బాడీ చూపిస్తారు. థియేటర్‌లో ఆ సీన్‌కి జనాలు అరుస్తారు, విజిల్స్ కొడతారు, పేపర్లు ఎగరేస్తారు. కానీ అదే సీన్ OTTలో చూసినప్పుడు ఆ మజా రాదు. ఈ అనుభవం థియేటర్ స్పెషల్” అని పేర్కొన్నారు.