Fahad Faasil: ఫహద్ ఫాజిల్ హీరోగా రెండు సినిమాలు ప్రకటించిన జక్కన్న కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Karthikeya Announces two movies with Fahad Faasil as Producer: రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతగా రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులు అనౌన్స్ చేశాడు. ఈ మేరకు ఆయన ఒక పోస్ట్ కూడా రాసుకొచ్చారు. రెండేళ్ల క్రితం కొత్త కుర్రాడు సిద్ధార్థ్ నాదెళ్లతో స్ఫూర్తిదాయకమైన ఫ్రెండ్‌షిప్ సబ్జెక్ట్‌పై పనిచేస్తున్నప్పుడు, మరో థ్రిల్లింగ్ ఫాంటసీ కథ అకస్మాత్తుగా మరో కొత్త కుర్రాడు శశాంక్ ఏలేటి ద్వారా మా దగ్గరకు వచ్చింది. విన్న వెంటనే అది కూడా మమ్మల్ని అంతే ఎగ్జైట్ చేసింది. ఇలా రెండు కథలు మా దగ్గరకు వచ్చినప్పటికీ ఈ రెండు స్క్రిప్ట్‌ల కోసం ఇద్దరూ ఒకే నటుడి వద్దకు వెళ్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు. అలాగే మొదటి నేరేషన్ లోనే అంగీకరిస్తాడని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఎవరినైతే నేను చాలా కాలంగా ఆరాధించానో, బహుముఖ ప్రజ్ఞకు ప్రతిరూపమో ఆయనే ఫహద్ ఫాసిల్ అంటూ ఆయన రాసుకొచ్చాడు. ఇక ఇప్పుడు బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో కలిసి రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు కార్తికేయ.
Mercy Killing: హీరోయిన్ గా జబర్దస్త్ భామ.. “మెర్సి కిల్లింగ్” చేయమంటోంది!
Also Read
ఈ రెండు సినిమాలలో ఫహద్ ఫాసిల్ హీరోగా నటిస్తూ ఉండటం గమనార్హం. సిద్ధార్థ్ నాదెళ్లతో ఫహాద్ ఫాజిల్ ఆక్సిజన్ అనే సినిమా చేయనుండగా ప్రశాంత్ ఏలేటి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనే పేరుతో ఒక సినిమా చేయబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక మలయాళ సినిమాని కొనుగోలు చేసి తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశాడు కార్తికేయ. ప్రేమలు పేరుతో మలయాళం లో సూపర్ హిట్గాంచిన సినిమాని తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమా తెలుగులో కూడా భారీ హిట్ గా నిలిచి మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పుడు అదే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన టాప్ హీరోతో రాజమౌళి కొడుకు రెండు సినిమాలు అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. ఫహద్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాలను మలయాళ తెలుగు భాషల్లో రిలీజ్ చేయడం కన్ఫామ్. మరి పాన్ ఇండియన్ రిలీజ్ కి వెళతారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!