NTV Telugu Site icon

Ruhani Sharma: సుహాస్, కార్తిక్ రత్నం చెప్పబోతున్న ‘శ్రీరంగ నీతులు’!

Sri

Sri

Sriranga Neethulu: అక్కినేని నాగేశ్వరరావు, ఎ. కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో గతంలో ‘శ్రీరంగ నీతులు’ అనే చిత్రం వచ్చింది. కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన ఆ సినిమా పేరుతోనే ఇప్పుడో న్యూ ఏజ్ కామెడీ డ్రామా తెరకెక్కుతోంది. సుహాస్, కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమా ద్వారా ప్ర‌వీణ్ కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్నారు. వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం శ‌ర‌వేగంగా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఈ రోజు టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. మైదానంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీని ముగ్గురు యువకులు ఆసక్తి ఆసక్తికరంగా గమనించడం ఇందులో ఉంది.
Sri1
ఈ సినిమాకు ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ హ‌ర్ష వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, ‘సేవ్ ది టైగ‌ర్స్’ ఫేమ్ అజ‌య్ అర్సాడ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టిజో టామి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విరాజ్ అశ్విన్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గీత భాస్క‌ర్‌, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల, దేవీ ప్ర‌సాద్, జీవ‌న్ రెడ్డి, సంజ‌య్ స్వ‌రూప్‌, సీవిఎల్ న‌ర‌సింహారావు ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.