Sriram Adithya: రేపు పెళ్లి పెట్టుకొని.. పవన్ సినిమాకు వెళ్ళా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sriram Adithya: టాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భలే మంచి రోజు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్.. శమంతకమణి, దేవదాస్, హీరో సినిమాలతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. అవకాశాలను అయితే అందుకున్నాడు కానీ.. ఇంకా స్టార్ డైరెక్టర్ అని అనిపించుకోవడానికి కష్టపడుతున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ తో ఒక సినిమా చేస్తున్నాడు. సినిమాలు రిలీజ్ అయితే తప్ప మీడియా ముందు కనిపించని ఈ డైరెక్టర్ తాజాగా.. ఒక కపుల్ షోకు భార్యతో సహా విచ్చేసి సందడి చేశాడు. కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ చేస్తున్న ఆ షోకు శ్రీరామ్.. తన భార్య ప్రియాంకతో వచ్చి.. సందడి చేయడమే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు.
Royal Weddings: శర్వానంద్ కన్నా ముందు రాజస్థాన్ లో రాయల్ వెడ్డింగ్స్ చేసుకున్న తారలు వీరే..
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
శ్రీరామ్, ప్రియాంక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట.. మొదటిసారి ప్రియాంక.. తనకు నచ్చిన పెర్ఫ్యూమ్ కొట్టుకొనేసరికి మాట్లాడాను అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పెళ్ళికి ముందు శ్రీరామ్ ఏ అమ్మాయితో మాట్లాడాలని చెప్పినా తానే హెల్ప్ చేసేదాన్ని అని చెప్పగా .. అంత సపోర్ట్ గా ఉంది కాబట్టే పెళ్లి చేసుకున్నాను అని శ్రీరామ్ నవ్వులు పూయించాడు. ఇక తమ పెళ్లి ఆర్య సమాజ్ లో జరిగింది అని, ఇప్పుడు అయితే నవ్వుతున్నాం కానీ, అప్పుడుపగిలిపోయింది అని చెప్పుకొచ్చారు. ఇక తన పెళ్లికి ఒక్కరోజు ముందు సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యిందని.. ఆ సినిమా బెన్ ఫిట్ షోకు వెళ్లిన్నట్లు శ్రీరామ్ తెలిపాడు.. ఇక దానికి ప్రియాంక మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సినిమా మిస్ అవ్వకూడదని వెళ్లారు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. పవన్ ఫ్యాన్స్ అంటే అలా ఉంటారు అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!