Srinidhi Shetty : ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న మూవీ రామాయణ. ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్ నటిస్తుండగా.. సీతగా సాయిపల్లవి నటిస్తోంది. రావణాసురుడిగా యష్ కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా శ్రీనిధి శెట్టిని తీసుకుంటే.. యష్ ను రాముడిగా, శ్రీనిధిని సీతగా అంటే జనాలు ఒప్పుకోరని ఆమె తప్పుకుందనే ప్రచారం ఉంది. ఈ విషయంపై తాజాగా శ్రీనిధి శెట్టి స్పందించింది. వాస్తవానికి రామాయణ కోసం నేను కూడా ఆడిషన్ ఇచ్చాను. కానీ సెలెక్ట్ కాలేదు. ఆ సినిమాకు ఆడిషన్ రావడమే నాకు చాలా గొప్ప విషయం. కానీ నేను చేయను అని చెప్పలేదు. ఆ వార్తలు నిజం కాదు అంటూ తెలిపింది శ్రీనిధి.
Read Also : The Raja Saab Trailer : ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్
సాయిపల్లవి ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుంది. సీత పాత్ర అంటే చాలా వెయిటేజ్ ఉంటుంది. ఆ పాత్రలో సాయిపల్లవి జీవిస్తుంది. అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు. ఆమె ఆ పాత్రకు న్యాయం చేస్తుందని నేను నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చింది శ్రీనిధి శెట్టి. ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ సిరీస్ తో భారీ క్రేజ్ దక్కించుకుంది. తెలుగులో నాని హీరోగా వచ్చిన హిట్-3 సినిమాలో కనిపించి మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు తెలుగులో అమ్మడికి మంచి ఛాన్సులు వస్తున్నాయి.
Read Also : OG : ఇన్నాళ్లకు పవన్ ఫ్యాన్స్ కల తీర్చేసిన సుజీత్..