Srinidhi Shetty : శ్రీనిధి శెట్టి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేసిన హిట్-3 మంచి హిట్ కొట్టింది. తెలుగులో ఆమెకు మంచి రూట్ పడింది. ఇంకేముంది వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయంట ఈ బ్యూటీకి. ఆమె చేసిన కేజీఎఫ్ సరీస్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ బ్యూటీ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తనను తన ఫ్రెండ్స్ అందరూ లేడీ ప్రభాస్ అని పిలుస్తారంటూ వివరించింది.
Read Also : Little Hearts : దుమ్ము లేపిన లిటిల్ హార్ట్స్.. మరో రికార్డు
దానికి గల కారణాలను కూడా బయట పెట్టింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఆయన పెద్దగా పోస్టులు చేయరు. నేను కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు పెట్టను. అందుకే నా ఫ్రెండ్స్ అందరూ లేడీ ప్రభాస్ అని పిలుస్తుంటారు. ఆ పిలుపు నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ తో నన్ను పోల్చడం కూడా నాకు సంతోషమే అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఈమె చేసిన కామెంట్లతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ రెబల్ స్టార్ ను ఎవరైనా సరే పొగడాల్సిందే అంటూ చెబుతున్నారు.
Read Also : The Girl Friend: నిన్న ఎంగేజ్మెంట్.. నేడు రిలీజ్ డేట్
