ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : SS. Rajamouli : ‘జూనియర్’ సినిమా ఫస్ట్ డే చూడాలని ఉంది
అయితే ఈ సినిమాలు హీరొయిన్ గా నటించిన శ్రీలీల గురించి ఇప్పుడు టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. ఎటువంటి సినిమా అనుభవం లేని కుర్రాడి పక్కన శ్రీలీల ఎలా నటించింది ఇందుకోసం భారీగానే తీసుకుని ఉంటది అని చర్చించుకుంటున్నారు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం శ్రీలీల ఏకంగా రెండు కోట్ల యాభై లక్షలకు పైగా తీసుకుందట. ఒకరకంగా చెప్పాలంటే ఆమె మార్కెట్ కంటే ఇది చాలా ఎక్కువ. సాధారణంగా ఒక సినిమాకు శ్రీలీల కోటి నుండి కోటిన్నర వరకు ఛార్జ్ చేస్తుంది. కానీ డెబ్యూ హీరో పక్కన నటిస్తే తన మార్కెట్ తగ్గుతుందని భారీగా రేట్ పెంచింది. అయినా సరే ఆమె అడిగినంత ఇచ్చి మరి జూనియర్ పక్కన నటింప చేసారట. శ్రీలీల రావడంతో జూనియర్ కు బజ్ అమాంతం పెరిగింది. ఇటీవల విడుదలైన వైరల్ వయ్యారి సాంగ్ సోషల్ మీడియాలో నిజంగానే వైరల్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ నెల 18న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.