Site icon NTV Telugu

Peddha Kapu Movie: పవన్ కళ్యాణ్ కి ‘పెద్ద కాపు’కు ఉన్న రిలేషన్ ఇదే!

Pawan Kalyan Peda Kapu

Pawan Kalyan Peda Kapu

Srikanth Addala Clarity on Peddha Kapu Movie Relation with Pawan kalyan:విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ విడుదలకి రెడీ అవుతోంది. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. పెద కాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా అని ట్రైలర్ ద్వారా కొంత క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ క్రమంలో సినిమా యూనిట్ మీడియాతో ముచ్చటించింది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ తాను సెన్సిబుల్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ నుంచి ఇలా మాస్ జానర్ కి మళ్లడం వెనుక ఒక కారణం ఉందని అన్నారు. ఎలాంటి సబ్జెక్ట్ అయినా డీల్ చేయాల్సిన బాధ్యత ప్రతి డైరెక్టర్ కి ఉండాలి, అది ఒక క్వాలిటీ లా ఉండాలి. నేను ఐఐటీలో పీహెచ్డీ చేస్తున్నప్పుడు అప్పటి మైండ్ సెట్ ప్రకారం మంచి చెప్పాలని అనుకున్నా. నా ఫ్రెండ్ చదువుతున్న బుక్ లో చూసి అలా అనుకున్నా. ఇక ఇప్పుడు ఇది యాక్షన్ జానర్ అని అన్నారు. ఇక మీడియా ప్రతినిధి ఒకరు ఈ సినిమాకి సామాన్యుడి సంతకం అని ట్యాగ్ లైన్ పెట్టారు.

Jigarthanda Double X: లారెన్స్ ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాడు.. జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌ టీజర్‌ చూశారా?

ఈ రోజున పవన్ కళ్యాణ్ కూడా తాను ఒక సామాన్యుడిని అని ముందుకు వెళ్తున్నారు. ఆయన క్యారెక్టర్ ను ఇందులో ఏమైనా చూపించారా అంటే ఎవరైనా సామాన్యులే అని ఆస్తిపాస్తులు, కుల మాటలకూ అతీతంగా అందరూ సామాన్యులే అని శ్రీకాంత్ అడ్డాల అన్నారు. ప్రతి ఒక్కరూ అన్ని ఎమోషన్స్ ఉన్న కామన్ మ్యాన్. అందరిలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, అందరూ చాలా ఉన్నతంగా ఉత్తమంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మనలో జలసీలు ఉంటాయి, కోపాలు,తాపాలు ఉంటాయి. మరోపక్క అంతా మంచే జరగాలనే ప్రయత్నాలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా కాదు మొత్తం సామాన్యులు అందరినీ దృష్టిలో పెట్టుకుని చేసిందని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ఇండియన్ లీడింగ్ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షిస్తున్న ఈ సినిమాకి రాజు సుందరం కొరియోగ్రాఫర్.

Exit mobile version