Site icon NTV Telugu

ఆ ఒక్కడి వల్లే ‘మా’లో సమస్య..!

మాలో నరేష్‌తో సమస్య అని గుర్తించాం.. అయనతోనే సమస్య.. ఆయనతో పని చేయడం సెట్ అవ్వదు.. మమ్మలని తప్పు చేశారు అని అనుకున్నా సరే.. ఇప్పుడే అంతా రాజీనామా చేస్తున్నామని వ్యాఖ్యానించారు హీరో శ్రీకాంత్.. మా ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి గెలిచినవారంతా రాజీనామా చేస్తూ ప్రకటన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్‌ మాట్లాడారు.. ఎన్నికల్లో నాకు ఓటువేసి గెలిపించిన అందరికీ.. నన్ను ఎన్నుకున్న వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నా.. అదే సమయంలో.. రాజీనామా చేస్తున్నందుకు క్షమాపణ కోరుతున్నాన్న శ్రీకాంత్.. కానీ, మీ అందరికీ అండగా ఉంటా.. బయటి నుంచే ప్రశ్నిస్తాం.. మేనిఫెస్టోలో పెట్టినవి అమలు చేయాలని కోరతాం అన్నారు..

ఒకే ప్యానల్ గెలవాలని మొదటి నుండి చెప్పాం అన్నారు శ్రీకాంత్‌.. కానీ, ఎన్నికల ఫలితాల్లో అలా జరగలేదన్న ఆయన.. నిజానిజాలు ఏంటి అనేది కూడా లోచన చేయాలన్నారు.. ఇక, ఎన్నికల్లో నరేష్ అద్భుతంగా పనిచేశారని మోహన్ బాబు అన్నారు.. ఆయన వెనకాల ఉండి నడిపిస్తారు అని తెలుసన్న శ్రీకాంత్.. నరేష్‌తోనే అసలు సమస్య అని గుర్తించామన్నారు.. మేం తప్పు జరిగితే ప్రశ్నించే వాళ్ళమే.. అక్కడ ఉంటే.. రెండు ప్యానెల్ల మధ్య సమస్యలతో ‘మా’లో పనిజరగదు.. అందుకే రాజీనామా చేస్తున్నామని వెల్లడించారు..

Exit mobile version