Site icon NTV Telugu

Sri Vishnu : క్రేజీ సెంటిమెంట్ తో హిట్ కొడుతున్న శ్రీ విష్ణు..

Sri Vishnu

Sri Vishnu

Sri Vishnu : ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆయన తాజాగా నటించిన మూవీ సింగిల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. అనుకోకుండా జరుగుతుందో లేదంటే కావాలనే చేస్తున్నారో తెలియదు గానీ.. శ్రీ విష్ణు సినిమాల విషయంలో ఓ సెంటిమెంట్ ప్రకారం హిట్ కొట్టేస్తున్నాడు. సింగిల్ మూవీకి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేదు. ఏదో చిన్న ఈవెంట్ చేసి కొద్ది మంది గెస్ట్ ల మధ్య దాన్ని చేశారు.

Read Also : Tragedy : ఓ ప్రేమకథ.. గాజుపెంకుతో ముగిసింది..!

ఈ మూవీ హిట్ అయింది. అంతకు ముందు సామజవరగమన మూవీకి ముందు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు. ఆ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. స్వాగ్ మూవీకి ముందు పెద్ద ఈవెంట్ చేశారు. ఆ మూవీ ప్లాప్ అయింది. ఇలా ఈవెంట్ సెంటిమెంట్లతో శ్రీ విష్ణుకు హిట్లు పడుతున్నాయన్నమాట. ఇది యాధృచ్చికంగా జరిగినా.. కావాలని జరిగినా.. ఇదో రకమైన సెంటిమెంట్ శ్రీ విష్ణుకు కలిసి వస్తోంది. మరి ముందు రాబోయే సినిమాలకు కూడా ఇదే రకమైన సెంటిమెంట్ ను ఫాలో అవుతాడా లేదా అన్నది చూడాలి.

Read Also : Laya : బాలకృష్ణ సినిమాలో నన్ను తీసేయమన్నాడు.. సీక్రెట్ చెప్పిన లయ..

Exit mobile version