పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు మే 9కి వచ్చేస్తుందని టీం బల్ల గుద్ది బలంగా చెబుతున్నప్పటికీ.. మాకు నమ్మకాలు లేవు దొర అంటున్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. రిలీజ్ కు కేవలం కొద్దీ రోజులు మాత్రమే ఉండటం.. ఇంకా ప్రమోషన్లను స్టార్ట్ చేయకపోవడం డౌట్ కలిగిస్తోంది. అదే టైంలో యంగ్ హీరో శ్రీ విష్ణు, నటి సమంత తమ సినిమాలను మే 9నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడం వీరమల్లు ఆ రోజున రాదన్న అనుమానాలు మరింత స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ డేట్ 11 సార్లు వాయిదా పడి ఓ రికార్డు సృష్టిస్తే మరో సారి పోస్ట్ పోన్ అయితే మరో రికార్డుకు తెరలేపినట్లే హరి హర వీరమల్లు.
Also Read : GBU : రూ. 200 కోట్ల క్లబ్ లో అజిత్ కుమార్..
మే 9ని మ్యాజికల్ డేట్‌గా ట్రీట్ చేస్తుంది టాలీవుడ్. కమల్ మరో చరిత్ర, భారతీయుడు, చిరంజీవి జగదీక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, వెంకీ ప్రేమించుకుందాంరా, నాగ్ అశ్విన్ మహానటి ఇదే డేట్ వచ్చి హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సో ఇదే తేదీన హరి హర వీరమల్లు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు మేకర్స్. కానీ పొలిటికల్ బిజీ షెడ్యూల్ కారణంగా పవన్ పై చిత్రీకరించాల్సిన షూట్ పెండింగ్ ఉంది. సో పవన్ సినిమా దాదాపు లేనట్టే. దాంతో అదే డేట్ పై సమంత కర్చీఫ్ వేసేసింది. ఆమె నిర్మాతగా వ్యవరించిన ‘శుభం’ మే 9న రిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేసింది సామ్. మే9నే శ్రీ విష్ణు ‘సింగిల్’ కూడా రెడీ అవుతోంది. ఈ ఇద్దరే కాదు మల్టీ స్టారర్ మూవీ భైరవం, అలాగే నితిన్ ‘తమ్ముడు’ మే 9 డేట్ పై ఓ కన్నేసి ఉంచాయి.
