NTV Telugu Site icon

Sreeleela: దగ్గుబాటి వారి పెళ్ళికి స్పెషల్ గెస్ట్.. రిలేషన్ ఏంటి.. ?

Sreeleela

Sreeleela

Sreeleela: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది అహింస అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు అభిరామ్. ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేనప్పటికీ అభిరామ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తరువాత తదుపరి సినిమాను ప్రకటిస్తాడు అనుకుంటే.. సడెన్ గా పెళ్లి పీటలు ఎక్కి షాక్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. ఇక డిసెంబర్ 6న అభిరామ్ పెళ్లి శ్రీలంకలో జరగనుంది. శ్రీలంకలోని అనంతర కలుతార అని ఫైవ్ స్టార్ రిసార్ట్ లో అభిరామ్ పెళ్లి ఘనంగా జరగనుంది. ఇక ఈ పెళ్లికి దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలు హాజరుకానున్నాయి. ఇక వీరితో పాటు ఈ పెళ్ళికి హాజరుకానున్న ఏకైక గెస్ట్.. స్టార్ హీరోయిన్ శ్రీలీల మాత్రమే అని వార్తలు వినిపిస్తున్నాయి.

Eagle: మాస్ మహారాజా.. ఊర మాస్ ప్రభంజనం.. ఆడు మచ్చా

అసలు దగ్గుబాటి కుటుంబానికి శ్రీలీలకు సంబంధం ఏంటి..? కేవలం శ్రీ లీల మాత్రమే ఎందుకు పెళ్లికి వెళుతుంది..? అని అనుమానాలు తలెత్తాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం అభిరామ్ పెళ్లి చేసుకుంటున్న ప్రత్యూష, శ్రీలీల చిన్ననాటి స్నేహితులు అంట. అమెరికాలో చదువుకున్నప్పుడు వీరిద్దరూ క్లాస్ మీట్స్ అని తెలుస్తోంది. అందుకే తన బెస్టీ పెళ్ళికి శ్రీలీల శ్రీలంక వెళ్తున్నట్లు తెలుస్తుంది. మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నా కూడా ఆమె వాటిని పక్కనపెట్టి బెస్టీ పెళ్లికి వెళ్లడానికి రెడీ అయిందని సమాచారం. ఇప్పటికే దగ్గుబాటి కుటుంబం శ్రీలంకలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశాయని సమాచారం. ఈ పెళ్ళికి దాదాపు 200 మంది అతిధులు హాజరుకానున్నారు. మరి బెస్టీ పెళ్ళిలో శ్రీలీల ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.

Show comments