Site icon NTV Telugu

NBK108: బాలయ్య కూతురు రంగంలోకి దిగేసింది

Sreeleela

Sreeleela

NBK108:నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి విజయంతో మంచి జోరు మీద ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ జోరు మీదనే మరో సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లిపోయారు. ఈ సినిమా తరువాత బాలయ్య- అనిల్ రావిపూడి కాంబోలో NBK 108 తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిసున్నారు. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోందని టాక్. ఇక ఈ చిత్రంలో బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనున్నాడని తెలిసిందే. అంతేకాదు.. బాలయ్యకు కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుందని ఇప్పటికే మేకర్స్ ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

Ram Charan: తారక్ ను సైడ్ యాక్టర్ అంటారా.. ఎంత ధైర్యంరా మీకు

ఇక తాజాగా శ్రీలీల ను సెట్ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. బాలయ్య చేతిని పట్టుకొని ఉన్న శ్రీలీల ఫోటోను షేర్ చేస్తూ NBK 108 లోకి స్వాగతం అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించనున్నాడట అనిల్ రావిపూడి. అనిల్ అంటేనే కామెడీ.. ఆయన మార్క్ కు తగ్గట్టే కామెడీ కూడా ఉండనున్నదట. దీంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Exit mobile version