Site icon NTV Telugu

Sree Vishnu: ఇక సపోర్ట్ చేయం.. మరువ తరమా హీరోపై శ్రీ విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు!

Sree Vishnu Harish Dhanunjay

Sree Vishnu Harish Dhanunjay

హరిష్ ధనుంజయ.. నువ్ ఇంకా చిన్నోడివి కాదని, ఇంకొన్నాళ్లు పొతే మేము సపోర్ట్ చేయం అని హీరో శ్రీ విష్ణు సరదాగా అన్నారు. హరీష్‌కి మంచి టైమింగ్ ఉంటుందని, సరైన సినిమా పడితే ఎక్కడికో వెళ్లిపోతాడన్నారు. హరీష్‌ మొన్నటివరకు స్లోగా సినిమాలు చేశాడని, ఇకపై చాలా వేగంగా మూవీస్ చేయాలని కోరుకుంటున్నానన్నారు. హరీష్ 10 ఏళ్లుగా తనకు తెలుసని, ‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తావా? రావా? అని సెట్టుకు వచ్చి కూర్చున్నాడని శ్రీ విష్ణు చెప్పారు. మరువ తరమా సినిమా నవంబర్ 28న విడుదల కానున్న సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు శ్రీ విష్ణుతో పాటు హీరో నారా రోహిత్ కూడా హాజరయ్యారు.

శ్రీ విష్ణు మాట్లాడుతూ… ‘నవంబర్ 28న రాబోతోన్న మరువ తరమా మూవీని అందరూ చూడండి. ఈ చిత్రంలో మాటలు కూడా పాటల్లా ఉన్నాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. రోహిణి గారు సినిమా చేశారంటే, పాత్రని ఒప్పుకున్నారంటే.. జనాలకు ఓ నమ్మకం ఉంటుంది. హరీష్ కోసమే ఇక్కడకు వచ్చా. హరీష్‌కి మంచి టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్‌ని ఆడియెన్స్ ఇష్టపడతారు. ఇకపై చాలా వేగంగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. డబ్బు కంటే పేరు కోసం ప్రయత్నిస్తున్న వారందరికీ తెలుగు ఆడియెన్స్ సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఈ మూవీని చూసి ఆదరిస్తారని, దీవిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Also Read: Maruva Tarama: ‘మరువ తరమా’ టీజర్, ట్రైలర్ చాలా నచ్చాయి.. ఏపీ డిప్యూటీ స్పీకర్!

నారా రోహిత్ మాట్లాడుతూ… ‘నవంబర్ 28న మరువ తరమా చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలోని సాంగ్స్, లిరిక్స్ చాలా బాగున్నాయి. కంటెంట్ కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. సినిమా టీజర్, ట్రైలర్ బాగున్నాయి. మంచి సినిమా వచ్చినప్పుడల్లా ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ మూవీని కూడా జనాలు ఆదరిస్తారని అనుకుంటున్నా. హరీష్ మాకు చాలా ఏళ్ల నుంచి మంచి మిత్రుడు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు.

Exit mobile version