‘Sravanthi’ Ravikishore: ‘కిడ’ చిత్రానికి గోవాలో స్టాండింగ్ ఒవేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Sravanthi’ Ravikishore: ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. గోవాలో ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ పనోరమా విభాగంలో ఎంపికైన ఈ సినిమాను థియేటర్లో ప్రదర్శించిన అనంతరం ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ‘కిడ’లో పూ. రామన్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది.
‘కిడ’ చిత్ర ప్రదర్శన సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”నేను చెన్నై వెళ్ళినప్పుడు ఓ స్నేహితుడి ద్వారా ఈ కథ గురించి తెలిసింది. స్క్రిప్ట్, డైరెక్టర్ నేరేషన్ వాయిస్ పంపించామని అడిగాను. కథ మొత్తం విన్నాను. బావుంటుందని వెంటనే ఓకే చెప్పాను. దర్శకుడికి తొలి సినిమా అయినా బాగా తీయగలడని, కథకు న్యాయం చేస్తాడనే నమ్మకంతో అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. అతడు స్క్రిప్ట్ ఏదైతే రాశాడో అదే తెరపైకి తీసుకొచ్చాడు. అందుకే, ఇవాళ ఇన్ని ప్రశంసలు లభిస్తున్నాయి. మా స్రవంతి సంస్థలో ఇది తొలి తమిళ సినిమా. సినిమాకు భాషాపరమైన ఎల్లలు, హద్దులు లేవు. మంచి సినిమా వస్తే సబ్ టైటిల్స్ తో కూడా చూస్తారు. అందుకనే, తమిళంలో తీశాను. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం” అని అన్నారు .
Also Read
చిత్ర దర్శకుడు ఆర్.ఏ. వెంకట్ మాట్లాడుతూ ”మధురైకి సమీపంలోని ఓ గ్రామం నేపథ్యంలో సినిమా తీశాం. తాతయ్య, మనవడు, ఓ మేకపిల్ల ఇందులో ముఖ్య పాత్రలు పోషించాయి. ఆ ముగ్గురి మధ్య ఎమోషన్స్ కీలకం. పనోరమాలో షో వేసినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చూశారు. నేను యంగ్ జనరేషన్ కి ఈ సినిమా కనెక్ట్ అవ్వదని అనుకున్నాను. కానీ, వాళ్ళు సీన్ టు సీన్ చెబుతుంటే సంతోషంగా ఉంది. నేను మా అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగాను. తమిళనాడులో దీపావళి ఘనంగా సెలబ్రేట్ చేస్తాం. నా బాల్యంలో జరిగిన సంఘటనల స్పూర్తితో తీశాం. ఈ రోజు సినిమా ఈ స్థాయికి వచ్చిందంటే కారణం మా నిర్మాత స్రవంతి రవికిశోర్ గారు. నా తొలి సినిమాకు అటువంటి నిర్మాత లభించడం అదృష్టం” అని అన్నారు. ఈ చిత్రానికి దాదాపుగా అందరూ కొత్తవాళ్ళు పని చేశారు. దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు… ఇలా చాలా మందికి తొలి చిత్రమిది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు పోషించారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!