స్పైడర్ మేన్ : నో వే హోమ్ సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్పైడర్ మేన్ సీరిస్ లో తాజాచిత్రం స్పైడర్ మేన్ : నో వే హోమ్ విడుదలై అర్ధశతం పూర్తి చేసుకుంది. డిసెంబర్ 16న ఈ సినిమా జనం ముందు నిలచింది. యాభై రోజులు పూర్తవుతున్నా ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉండడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా 1.74 బిలియన్ డాలర్లు పోగేసింది. అంటే మన కరెన్సీ లో దాదాపు ఒక వేయి మూడు వందల కోట్ల రూపాయలు. స్పైడర్ మేన్: నో వే హోమ్ చిత్ర నిర్మాణానికి 200 మిలియన్ డాలర్లు ఖర్చయింది. అంటే మన కరెన్సీలో 300 కోట్ల రూపాయలు. అంటే ఈ సినిమా వల్ల కేవలం మూడు నెలల్లోనే 1.3 బిలియన్ డాలర్ల నెట్ ప్రాఫిట్ ను సోనీ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో స్పైడర్ మేన్ ఐడెంటిటీని బహిర్గతం చేయడం, డాక్టర్ స్ట్రేంజ్ సహాయంతో సమస్యలను పరిష్కరించడం అన్న అంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని సోనీ సంస్థ చెబుతోంది. ప్యాండమిక్ లో కూడా స్పైడర్ మేన్: నో వే హోమ్ ఈ స్థాయి వసూళ్లు చూస్తుందని కలలో కూడా ఊహించలేదని ట్రేడ్ పండిట్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఈ గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో సోనీ, మార్వెల్ సంస్థలు మరిన్ని స్పైడర్ మేన్ మూవీస్ తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే భారీ చిత్రాలను రూపొందించడంలో మేటి అనిపించుకున్న ఈ సంస్థలు స్పైడర్ మేన్ సీరీస్ కోసం కలసి కట్టుగా ముందుకు సాగాయి. ఇప్పటికి స్పైడర్ మేన్ సీరీస్ లో ఈ రెండు సంస్థలు మూడు చిత్రాలు రూపొందించాయి. రాబోయే సినిమాలతో మరింతగా ఆకట్టుకొనే ప్రయత్నంలో సోనీ, మార్వెల్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి భవిష్యత్ లో స్పైడర్ మేన్ మరెన్ని హంగులు పులుముకుని జనం ముందు నిలుస్తాడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!