NTV Telugu Site icon

Rashmika : చేతి నిండా ప్రాజెక్టులతో రష్మిక మందన్న ఫుల్ బిజీ..

Sweety

Sweety

కన్నడ ఇండస్ట్రీని నుండి ఉవ్వెత్తున టాలీవుడ్‌లో ఎగసి.. ఆపై బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది రష్మిక మందన్న. పుష్ప1తో నేషనల్ క్రష్ ట్యాగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. చేతి నిండా సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. బీటౌన్ ముద్దుగుమ్మలు కూడా అసూయ పడేలా ఆమె మూవీ లైనప్స్ ఉన్నాయి. ఆమె చేస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కొట్టడంతో బాలీవుడ్ ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. అయితే గత ఏడాది యానిమల్ హిట్ వచ్చాక.. ఆమె నుండి మరో మూవీ రాలేదు. దాదాపు ఫ్యాన్స్‌ను పలకరించి వన్ ఇయర్ కావొస్తుంది.

Also Read : Kanguva : సూర్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ‘కంగువ’ సాదిస్తోంది : కేఈ జ్ఞానవేల్ రాజా

యానిమల్ తర్వాత.. కమిటైన చిత్రాలన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. పుష్ప 2తో సహా ఏడు ప్రాజెక్టులు సెట్స్ పైనే ఉండటంతో రష్మిక నుండి మరో మూవీ రాలేదు. సో ఈ గ్యాప్  తగ్గించేందుకు, ఫ్యాన్స్‌ను దిల్ ఖుష్ చేసేందుకు ఫిక్స్ అయ్యింది బ్యూటీ. నెక్ట్స్ ఇయర్ తనదే అంటోంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ చేసేందుకు ప్రిపేర్ అవుతుంది. ఓ వైపు లేడీ ఓరియెంట్ చిత్రాలు.. మరో వైపు కమర్షియల్ చిత్రాలు చేస్తోంది.

Also Read : kA : 50 కోట్ల క్లబ్ లో కిరణ్ అబ్బవరం..

రెయిన్ బో, ద గర్ల్ ఫ్రెండ్ ఉమెన్ సెంట్రిక్ ప్రాజెక్టులతో పాటు ఛావా, సికిందర్ వంటి స్టార్ హీరో చిత్రాలను లైన్లో పెట్టింది. ఇక థామా, కుబేర ఉండనే ఉన్నాయి. ఈ సిక్స్ మూవీస్ నెక్ట్ ఇయర్ ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఈ ఇయర్ గ్యాప్‌ను ఈ సినిమాలతో ఫిలప్ చేయనుంది ఈ కన్నడ సోయగం. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రమోషన్స్ కూడా పీక్స్‌కు చేరుకుంటున్నాయి. పాన్ ఇండియన్ లెవల్లో రిలీజ్ అవుతున్న ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ఛాన్సులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉండటంతో… ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకుంది క్రష్మిక.

Show comments