వైవిధ్యం… సూర్య ఆయుధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిభావంతులను ఆదరించడంలో తెలుగువారు ముందుంటారు. తమిళ స్టార్ హీరో సూర్యను మనవాళ్ళు భలేగా ఆదరిస్తున్నారు. సూర్య నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమవుతూ, ఇక్కడా విజయం సాధిస్తూనే ఉన్నాయి. ప్రముఖ తమిళనటుడు శివకుమార్ పెద్ద కొడుకు సూర్య. తండ్రి బాటలోనే పయనిస్తూ సూర్య నటనలో అడుగు పెట్టారు.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన ‘నెర్రుక్కు నెర్’ సినిమాతో పరిచయమైన సూర్య, ‘నందా’తో నటునిగా గుర్తింపు సంపాదించారు. ‘కాక్క కాక్క’తో మంచి విజయం చూశారు. ఈ సినిమా తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘ఘర్షణ’ పేరుతో రీమేక్ అయింది. మరో విలక్షణ నటుడు విక్రమ్ తో కలసి సూర్య నటించిన ‘పితామగన్’ మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘శివపుత్రుడు’గా అనువాదమై మంచి విజయం సాధించింది. అప్పటి నుంచీ తెలుగులోనూ సూర్యకు మంచి ఆదరణ లభించసాగింది. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన ‘గజిని’తో సూర్యకు స్టార్ స్టేటస్ లభించింది. ఈ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో అనువాదమై సూర్యను తెలుగువారికి మరింత దగ్గర చేసింది.
Also Read
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. 'ఎన్టీఆర్' 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
సూర్య డబ్బింగ్ సినిమాలు “యువ, ఆరు, సింగమ్ సీరీస్, సెవెంత్ సెన్స్, 24, ఎన్.జి.కె, గ్యాంగ్” వంటి చిత్రాలు ఆకట్టుకున్నాయి. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్తచరిత్ర’ తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంలో సూర్య ఏటూరి సూర్యనారాయణ రెడ్డి పాత్రలో అలరించారు. సూర్య తమ్ముడు కార్తీ సైతం తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. సూర్య భార్య జ్యోతిక కొన్ని తెలుగు చిత్రాలలో నటించి అలరించింది.
తెలుగు దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో అనువాదమయింది. సూర్య నిర్మాతగానూ అనేక చిత్రాలు నిర్మించారు. ఈ సినిమాలు కూడా తెలుగులో డబ్బింగ్ మూవీస్ గా అలరించాయి. సూర్య నటిస్తోన్న 40వ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించిన సూర్య, రాబోయే సినిమాలోనూ వైవిధ్యంగా కనిపిస్తారని చెబుతున్నారు. మరి సూర్య 40వ సినిమా ఏ తీరున అలరిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Dhanush Politics: విజయ్ తర్వాత రాజకీయాల్లోకి ధనుష్?.. బహిరంగ సభతో రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు
-
Student Death: సీఎంతో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య.. రంపచోడవరంలో కలకలం!
-
Bhatti Vikramarka: ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదు.. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
Bihar Bandh AK-47 Firing: విద్యార్థుల నిరసనలో.. ఏకే-47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ సస్పెండ్..
ట్రెండింగ్
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!