Site icon NTV Telugu

Pre release Hangama : ఆచార్య అదిరింది.. రచ్చ రచ్చే..!

Acharya

Acharya

నిన్న మొన్నటి వరకు ట్రైలర్, సాంగ్స్‌తో ఓ మోస్తరుగా సందడి చేసిన ఆచార్యకు.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో భారీ హంగామా మొదలైంది. మెగాభిమానులతో పాటు సదరు ఆడియెన్స్ కూడా.. ఇప్పుడు ఆచార్య గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆచార్య ట్రైలర్‌ యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించి.. టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్‌గా ఆచార్య రికార్డు క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ ట్రైలర్ 30 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆచార్య టీమ్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇక రీసెంట్‌గా వచ్చిన భలే భలే బంజారా సాంగ్‌కు విశేష స్పందన వస్తోంది. చిరు, చరణ్ ఈ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూ ట్యూబ్‌లో 10 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇదే కాదు మణిశర్మ సంగీతంలో ఈ సినిమా నుంచి వచ్చిన పాటలన్నీ అదరహో అనేలా ఉన్నాయి.

Watch Acharya Pre release Event Live :

ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌గా వచ్చిన లాహే లిరికల్ సాంగ్ సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ పాట నుంచి వీడియో సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఆ ప్రోమో చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇందులో చిరు స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. మెగాస్టార్ తన గ్రేస్‌తో.. తనదైన శైలిలో వేసిన స్టెప్పులకు మెగా ఫ్యాన్స్ అంతా మెస్మరైజ్ అయ్యిపోతున్నారు. దాంతో ఈ పాటలో మెగాస్టార్ మరోసారి తన డ్యాన్స్‌తో కుమ్మేయడం ఖాయమంటున్నారు. మెగా స్టెప్పులకు థియేటర్లో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పొచ్చు. ఇలా ఒక్కో అప్టేడ్ అచార్య పై అంచనాలను పెంచేసేలా ఉన్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మెగాభిమానుల్లో మరింత జోష్ వచ్చింది. దాంతో ఆచార్యను థియేటర్లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్‌కు జంటగా కాజల్ అగర్వాల్ నటించగా.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మరి అంచనాలు పెంచేస్తున్న ఆచార్య ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version