NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో నటించబోతున్నారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలకపాత్రలో కనిపించనుంది. NBK107 మూవీకి తమన్ సంగీతం సమకూర్చనుండగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న NBK107 చిత్రానికి మేకర్స్ ‘వేటపాలెం’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక తాజా సమాచారం ఏమిటంటే… నందమూరి అభిమానులను హుషారెత్తించే బిగ్ అప్డేట్ రాబోతోందట.
Read Also : Attack Challenge : బాలీవుడ్ హీరోకు అదిరిపోయే వీడియోతో సామ్ రిప్లై
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం తెలుగు వారి పండగ ఉగాదిని సందర్భాన్ని పురస్కరించుకుని NBK107 ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ విడుదల కానుంది. అంతేకాదు సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ ఒక ఆసక్తికరమైన గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయనున్నారట. ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ… ఒకవేళ ఇదే నిజమైతే నందమూరి ఫ్యాన్స్‌కి మాస్ ఫీస్ట్ కాబోతోంది.
