Site icon NTV Telugu

Rana Naidu: త్వరలో రిలీజ్ కానున్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్

Rana Naidu

Rana Naidu

విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకునే అన్ని హిట్స్ కొట్టిన వెంకటేష్ పుట్టిన రోజు సంధర్భంగా నెట్ఫ్లిక్స్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. వెంకటేష్, రానాలు కలిసి నెట్ఫ్లిక్స్ కోసం ఒక సిరీస్ లో నటించారు, ‘రానా నాయుడు’ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. యాక్షన్ క్రైమ్ డ్రామా జనార్ లో రూపొందిన ఈ సిరీస్ కి ‘మచ్చ రవి’ స్క్రీన్ ప్లే అందించగా సుపర్న్ వర్మ, కరణ్ లు దర్శకత్వం వహించారు. అమరికన్ సిరీస్ ‘రే డోనోవన్’కి తెలుగు వెర్షన్ గా ‘రానా నాయుడు’ 2021 సెప్టెంబర్ 21న అనౌన్స్ అయ్యింది. అక్టోబర్ 2021లో రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టి మే 2022కి కంప్లీట్ చేశారు. రీసెంట్ గా మేకర్స్ ‘రానా నాయుడు’ టీజర్ ని రిలీజ్ చేశారు. వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో స్టైలిష్ గా కనిపించాడు. టీజర్ లో రానా, వెంకటేష్ ల మధ్య సీన్స్ దగ్గుబాటి అభిమానులని ఆకట్టుకున్నాయి. ఈ ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ ‘రానా నాయుడు’ సిరీస్ కే హైలైట్ గా నిలుస్తాయని సమాచారం.

‘సుచిత్ర పిళ్ళై’, ‘గౌరవ్ చోప్రా’, ‘సుర్వీన్ చావ్లా’ ఇతర పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. వెంకటేష్ పుట్టిన రోజు సంధర్భంగా ‘రానా నాయుడు’ నుంచి బయటకి వచ్చిన పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే వెంకటేష్ పుట్టిన రోజున దగ్గుబాటి అభిమానులకి స్పెషల్ గిఫ్ట్ గా ‘నారప్ప’ సినిమాని ఒక్కరోజు థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకోని మరీ ఫాన్స్ కోసం ‘నారప్ప’ని థియేటర్స్ లో రిలీజ్ చేశారు.  ‘నారప్ప’ సినిమాని థియేటర్స్ లో చూడాలి అనుకున్న దగ్గుబాటి అభిమానులు థియేటర్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.

Exit mobile version