Site icon NTV Telugu

ఓటీటీ కోసం తెలుగులో మరో కొత్త ‘బిగ్ బాస్’

Bigg-Boss-5

ఇటీవల కాలంలో తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటికి నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో 5వ సీజన్ కి రెడీ అయింది. పోటీదారుల ఎంపిక పూర్తయి క్వారంటైన్ లో ఉన్నారు. మూడో సారి నాగార్జున హోస్ట్ గా సెప్టెంబర్ నుంచి ఈ షో ప్రసారానికి సిద్ధం అవుతోంది. షణ్ముఖ్, రవి, వర్షిణి వంటి పేరున్న కళాకారులు ఇందులో పాలు పంచుకోబోతున్నట్లు పుకార్లుతో సోషల్ మీడియాలో సందడి సందడిగా ఉంది.

Read Also : చీటింగ్ కేసులో ఆర్యకి రిలీఫ్

ఇదిలా ఉంటే స్టార్ మా బిగ్ బాస్ కి సంబంధించిన మరో వెర్షన్‌ కూడా రెడీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హింఈలో బిగ్ బాస్ మేకర్స్ ప్రత్యేకంగా OTT వెర్షన్‌ను ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. ఈ వెర్షన్ లో కొత్త పోటీదారులు కొత్త హోస్ట్ ఉంటారు. సల్మాన్ ఖాన్ టీవీ వెర్షన్‌ కి హోస్ట్ గా వ్యవహరిస్తుంటే… కరణ్ జోహార్ OTT వెర్షన్‌ని హోస్ట్ చేస్తున్నారు. అదే పద్ధతిలో తెలుగులో కూడా OTT వెర్షన్ లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హాట్‌స్టార్ తెలుగు బిగ్ బాస్ టీవీ వెర్షన్‌ను ప్రసారం చేస్తోంది. బిగ్ బాస్ మేకర్స్ రియాలిటీ షో OTT వెర్షన్‌ ని ఏ OTT ప్లాట్‌ఫారమ్‌ లో టెలీకాస్ట్ చేస్తారనేది తేలాల్సి ఉంది. ఈ ఓటీటీ వెర్షన్ లో 24 గంటల పాటు బిగ్ బాస్ షో ప్రసారం ఉంటుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే… బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ లో ఆడియన్స్ చూసేయవచ్చు. మరి ఈ ఓటీటీ వెర్షన్‌ ని ఎవరు హోస్ట్ చేస్తారు? అందులో పాల్గొన బోయే పోటీదారులు ఎవరు? ఇలాంటి వాటిపై క్లారిటీ రావలసి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Exit mobile version