NTV Telugu Site icon

Spark L.I.F.E: పాన్ ఇండియా లెవల్లో ‘స్పార్క్L.I.F.E’.. ఆగస్ట్ 2న టీజర్

Spark Life

Spark Life

Spark L.I.F.E Teaser to be released on August 2nd: విక్రాంత్‌ హీరోగా మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్ L.I.F.E’ రిలీజ్ కు రెడీ అవుతోంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోన్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇక ఈ సినిమా టీజ‌ర్‌ను ఆగ‌స్ట్ 2న సాయంత్రం 6 గంట‌ల 45 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్నట్లు నిర్మాత‌లు ప్రకటించారు. సోమ‌వారం రోజున‌ టీజ‌ర్‌కు రిలీజ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయగా ఆ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే విక్రాంత్ ఇన్‌టెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఇక ఆయన చేతిలో ఒక మాస్క్ ఉండగా డార్క్ టోన్‌తో ఉన్న ఈ పోస్ట‌ర్ ప్ర‌తీ ఒక్క‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇక ‘స్పార్క్’ మూవీ షూటింగ్ అంతా పూర్తయిందని , పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయని మేకర్స్ వెల్లడించారు.

SS Thaman: నా ధైర్యం, నా బలం త్రివిక్రమ్.. కానీ దేవునిపై మనసు విరిగింది !

ఇక ఇప్పుడు రిలీజ్ కానున్న టీజ‌ర్ ఎలా ఉంటుందా? అని అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. మెహ‌రీన్ ఫిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సైక‌లాజిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌తో ఈ విక్రాంత్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ద‌ర్శ‌క నిర్మాణంలో అన్ కాంప్రమైజ్డ్‌గా రూపొందుతోన్న ఈ యూనిట్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ‘హృదయం’, విజయ్ దేవరకొండ ఖుషి ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తుండటం గమనార్హం. మలయాళ విలక్ష‌ణ న‌టుడు గురు సోమ‌సుంద‌రం కీల‌క పాత్ర‌లో నటించిన ఈ సినిమాలో నాజ‌ర్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, స‌త్య‌, శ్రీకాంత్, కిర‌ణ్‌ అయ్యంగార్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.