సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందమైన నటీమణులలో త్రిష కృష్ణన్ ఒకరు. గ్లామరస్ లుక్స్, అత్యద్భుతమైన నటనా నైపుణ్యంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న త్రిష… మణిరత్నం హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్”లో భాగం కానుంది. ఇక తాజాగా ఈ చెన్నై చంద్రం స్టార్స్ తో కలిసి డిన్నర్ పార్టీలో పాల్గొంది. తమిళ ప్రముఖులు చాలామంది ఈ వీకెండ్ డిన్నర్ పార్టీలో కలవడం, అందరూ కలిసి ఫోటోలు దిగడం, ఎంజాయ్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. శుక్రవారం రాత్రి చెన్నైలో ఈ వీకెండ్ పార్టీలో త్రిషతో పాటు రమ్య కృష్ణ, బోనీ కపూర్, రాధిక శరత్ కుమార్, గౌతమ్ మీనన్, ఖుష్బు తదితరులు సందడి చేశారు. త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో స్టార్స్ తో కలిసి గడిపిన అద్భుతమైన క్షణాలను పంచుకుంది.
Read Also : BheemlaNayak : బుక్ మై షోలో కన్పించని మూవీ… పవన్ ఫ్యాన్స్ కి షాక్
త్రిష కృష్ణన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో గ్రూప్ పిక్‌ని షేర్ చేసింది. అందులో బోనీ, రమ్య, రాధిక, ఖుష్బూ, సుమలత, ప్రభు, శోభన తదితరులు చిరునవ్వుతో పోజులివ్వడాన్ని చూడవచ్చు. ఆమె తన స్నేహితురాళ్లతో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ త్రిష #Aboutlastnight #MyTribe అంటూ రాసుకొచ్చింది. అయితే ఇంతమంది తమిళ సెలబ్రెటీలు ఒకేచోట చేరి, కలిసి పార్టీ చేసుకోవడం ఇదే తొలిసారి. అజిత్ కుమార్ నటించిన”వాలిమై” ఫిబ్రవరి 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న బోనీ కపూర్ ప్రస్తుతం చెన్నైలో ఉన్నాడు.
