Site icon NTV Telugu

Varasudu: అమ్మ పాట ప్రోమో వచ్చింది…

Varisu

Varisu

దళపతి విజయ్, దిల్ రాజు ప్రొడక్షన్ లో నటిస్తున్న సినిమా ‘వారసుడు’. జనవరి 12న తెలుగు, తమిళ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ మంచి స్వింగ్ లో జరుగుతున్నాయి. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ‘వారసుడు’ మూవీ నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘సోల్ ఆఫ్ వారసుడు’ అనే పేరుతో బయటకి రానున్న ఈ సాంగ్ ని ‘చిత్ర’ పాడగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. ఈరోజు సాయంత్రం 5:30కి బయటకి రానున్న ఈ సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. ‘సోల్ ఆఫ్ వారసుడు’ అనే టైటిల్ కి తగ్గట్లే మంచి సోల్ ఫుల్ మ్యూజిక్ తో స్టార్ట్ అయిన ప్రోమో సాంగ్ చిత్ర గారి వాయిస్ తో బ్యూటిఫుల్ గా మారింది. “కన్నా ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మ” అంటూ ఎండ్ అయిన ప్రోమో, వారసుడు సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా బలంగా ఉందని తెలిసేలా చేసింది. మరి ఫుల్ సాంగ్ వచ్చే లోపు, సోల్ ఆఫ్ వారసుడు ప్రోమో సాంగ్ పై మీరు కూడా ఒక లుక్కెయ్యండి…

Exit mobile version