బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన స్టైల్ తో బాలీవుడ్ లో బ్యూటీ ఐకాన్ గా నిలవడమే కాదు… తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంది. దానిపై ఎన్ని ట్రోల్స్ ఎదురైనా ఆమె వెనక్కి మాత్రం తగ్గదు. తాజాగా అజ్ఞాని… అంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేసింది సోనమ్ కపూర్. రీసెంట్ గా ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ ముంగంటివార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ వారికి సమాన అవకాశాలను కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ సుధీర్ ముంగంటివార్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
సుధీర్ ముంగంటివార్ ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. ఆ వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో అతను మహారాష్ట్ర పబ్లిక్ యూనివర్శిటీ చట్టం, 2016 ప్రకారం ప్రతిపాదిత సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయంపై తాజాగా స్పందించిన సోనమ్ ఎగ్జిస్ట్ ఇండియా ద్వారా వైరల్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ “అజ్ఞాని నిరక్షరాస్యులు, ద్వేషపూరితం” అంటూ కౌంటర్ వేశారు. సోనమ్ మాత్రమే కాదు సన్నీ లియోన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ముంగంటివార్ వ్యాఖ్యలను తప్పుబడుతూ మండిపడుతున్నారు.
