సోనాలి బింద్రే ఈ పేరు వినగానే .. బంగారు కళ్ల బుచ్చమ్మ కళ్లముందు మెదులుతుంది. మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందంతో మంత్రం ముగ్దులను చేసి వారి మాస్నులో సుస్థిర స్థానాన్ని సంపాందించుకుంది. సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ కెరీర్ పీక్స్ ఉండగానే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఒక బాబు పుట్టాకా ఆమె జీవితం క్యాన్సర్ తో అంధకారంగా మారింది. అయినా ఆ కష్టాన్ని లెక్కచేయకుండా బాధను దిగమింగుకొని కొన్నేళ్లు కఠినమైన కీమో థెరపీ చేయించుకొని క్యాన్సర్ బారి నుంచి బయటపడింది. ఆమె పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఇక ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో బౌన్స్ బ్యాక్ అయిన ఈ హీరోయిన్ హిందీ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే చిన్న పిల్లల షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక తాజాగా ఆ షో లో దిగిన కొన్ని ఫోటోలను సోనాలి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రెడ్ కలర్ క్రాప్ టాప్.. దాని మీద డిజైనర్ గోల్డ్ జ్యూయలరీ.. కర్లీ హెయిర్ తో సోనాలి ఎంతో అందంగా కనిపిస్తోంది. అప్పుడు మురారి సమయంలో ఎలా యైతే ఉందో.. ఇప్పుడు కూడా అదే అందంతో మైమరిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే సోనాలి త్వరలోనే టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆవార్తలో నిజమెంత అనేది తెలియాలి.
