NTV Telugu Site icon

బికినీ స్టిల్స్ అడిగిన అభిమానికి సోనాక్షి హిలేరియస్ రిప్లై

Sonakshi Sinha Hilerious Reply to Netizen

షాట్ గన్ శతృఘ్నసిన్హా తనయ సోనాక్షి లో సెన్సాఫ్ హ్యూమర్ బాగా ఎక్కవ. అది మరోసారి బయట
పడింది. ఇటీవల సోనాక్షి సిన్హా ఇన్‌ స్టాలో ‘నన్ను ఏదైనా అడగండి’ అండూ ఫ్యాన్స్ తో సెషన్‌ నిర్వహించింది. అభిమానుల ప్రశ్నలకు చమత్కారంతో సరదాగా సమాధానాలు చెప్పింది. ఓ అభిమాని సందట్లో సడేమియా అన్నట్లు సోనాక్షిని ‘బికినీ ఫోటోగ్రాఫ్‌లు’ కావాలని అడిగాడు. దానిని స్పాంటేనియస్ గా తీసుకున్న సోనాక్షి అతగాడికి బికినీ పిక్స్ పంపి సర్ ప్రైజ్ చేసింది. అమ్మడి సెన్సాఫ్‌ హ్యూమర్ కి అందరూ స్పెల్ బౌండ్ అయ్యారు.

Read also : డ్రగ్స్ కేసుపై తమ్మారెడ్డి భరద్వాజ సెన్సేషనల్ కామెంట్స్

ఇక మరో అభిమాని ఏం తింటున్నారు బాగా వెయిట్ లాస్ అయ్యారు అని అడగ్గా… గాలి తింటున్నానని సరదాగా వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురైన సోనాక్షి గత ఏడాది ట్విట్టర్‌ కి గుడ్ బై చెప్పింది. ఇన్‌స్టాలో ఇదే విషయాన్ని తెలియచేసింది. సోనాక్షి నటించిన ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ ఈ నెల 13న ఓటీటీలో విడుదలైంది. ఇందులో అజయ్ దేవగన్, శరద్ కేల్కర్, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ‘కాకుడ’ సినిమాలో నటిస్తోంది సోనాక్షి.