‘బూట్ కట్ బాలరాజు’గా బిగ్ బాస్ సోహెల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహెల్, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం ‘బూట్ కట్ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్ కొట్టగా మిర్యాల రవీందర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ -”లాక్‌డౌన్ టైమ్‌లో రిలీజైన ‘పాగల్’ మూవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. థియేటర్, ఓటిటి, శాటిలైట్ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా విషయానికి వస్తే గత ఆరేడు నెలలుగా సోహెల్‌తో ఒక పాయంట్ అనుకుని దాన్ని కథగా మార్చి ఈ రోజు ఓపెనింగ్ జరిపాం. కోనేటి శ్రీను నా మిత్రుడు. చాలా ఏళ్లుగా మేమిద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఇలాంటి కథ సోహెల్ కి కరెక్ట్. ‘హుషారు’ తర్వాత ఆ తరహాలో మరో మంచి కథలో వస్తున్న సినిమా ‘బూట్ కట్ బాలరాజు’. జనవరి, పిబ్రవరిలో వరుసగా షెడ్యూల్స్ జరిపి సినిమా పూర్తి చేస్తాం. తెలంగాణ క్యారెక్టరైజేషన్ కావడంతో తెలుగమ్మాయి కావాలని అనన్యని తీసుకున్నాం. నా మిత్రుడు భాష గ్లోబల్ ఫిలింస్‌తో ఈ సినిమాతో అసోసియేట్ అవుతున్నారు” అని అన్నారు.
సోహెల్ మాట్లాడుతూ – ”బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న రెండో చిత్రమిది. దాదాపు తొమ్మిది నెలలు స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది. డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి. బూట్ కట్ బాలరాజు అనే క్యారెక్టర్ డెఫినెట్‌గా మీ అందరిలో ఉండిపోతుంది. అన్ని వర్గాల వారు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ – ” ‘మల్లేశం’ సినిమా నుండి పెర్‌ఫామెన్స్ ఓరియెంటెట్ క్యారెక్టర్స్ రావడం మొదలైంది. ఈ సినిమాలో కొంచెం బబ్లీగా ఉండే క్యారెక్టర్. నాకు చాలా ఇష్టమైన పాత్ర. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. లక్కీ మీడియాలో సోహెల్‌తో కలిసి చేయడం చాలా హ్యాపీ” అని తెలిపింది.
Also Read
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
- Shah Rukh Khan: 'నా భర్త కంటే మీరే ఇష్టం'.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
- RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
- Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
తాజావార్తలు
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్‌స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!