NTV Telugu Site icon

Mega157: పంచభూతాలు కూడా మెగాస్టార్ కోసం కదిలోస్తాయి… వేయండ్రా విజిల్స్

Mega 157

Mega 157

మెగాస్టార్ చిరంజీవి బర్త్ రోజు వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిటింగ్ కి సరైన సమాధానం ఈ మధ్య కాలంలో రాలేదు. ఏ సినిమా చూసినా ఇది చిరు చేయాల్సింది కాదు అనే మాట తప్ప. అబ్బా అన్ని రోజులకి చిరు సరైన సినిమా చేస్తున్నాడు, ఇక మా సత్తా ఏంటో చూపిస్తాం అని మెగా అభిమానులు అనుకున్న సందర్భం గత అయిదారు ఏళ్లలో అయితే జరగలేదు. ఈ మ్యాటర్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఒక జగదేక వీరుడు రేంజ్ ఫాంటసీ డ్రామా చేస్తే ఎలా ఉంటుంది… థియేటర్స్ పూనకాలతో ఊగిపోతాయి కదా. అలాంటి అనౌన్స్మెంట్ నే ఇచ్చిన యువీ క్రియేషన్స్. నందమూరి కళ్యాణ్ రామ్ కి బింబిసారా లాంటి హిట్ ఇచ్చాడు కొత్త దర్శకుడు వశిష్ఠ. మొదటి సినిమాతోనే సెమీ పీరియాడిక్ సోషియో ఫాంటసీ డ్రామా సినిమా చేయడం రిస్క్ అంటే ఆ రిస్క్ తోనే డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు వశిష్ట.

స్క్రిప్ట్ మీద తనకున్న కమాండ్ కి, తక్కువ బడ్జట్ లో కూడా తను ఇచ్చిన అవుట్ ఫుట్ కి సినీ అభిమానులంతా ఫిదా అయ్యారు. ఇలాంటి దర్శకుడితో చిరు తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసాడు. చాలా రోజులుగా వశిష్ట-చిరు కలయిక గురించి వస్తున్న వార్తలని నిజం చేస్తూ మెగాస్టార్ బర్త్ డే రోజున ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. అనౌన్స్మెంట్ కోసం పంచభూతాలని పెట్టి డిజైన్ చేసిన పోస్టర్ ఇంప్రెస్ చేసింది. పంచభూతాలు పోస్టర్ లో ఉన్నాయి అంటే మెగా 157 ఖచ్చితంగా ఫాంటసీ డ్రామా సినిమానే అవుతుంది. వరస బెట్టి చేసిన రీమేక్స్ తర్వాత చిరు చేస్తున్న ఈ స్ట్రెయిట్ సినిమా అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టడం గ్యారెంటీ. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.