Site icon NTV Telugu

Sobhita Dhulipala: తెనాలి అమ్మాయి.. హాలీవుడ్ కి.. ఏం కిక్ ఉంది మావా

Sobitha

Sobitha

Sobhita Dhulipala: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎవరు టాప్ లో ఉంటారు.. ఎవరు లాస్ట్ లో ఉంటారు అనేది ఎవరు అంచనా వేయలేరు. ఒక్క సినిమా చేసి స్టార్స్ అయినా వారు ఉన్నారు. ఒక్క ప్లాప్ ఇచ్చి లాస్ట్ కు వెళ్లిన వారు ఉన్నారు. ఒక భాషలో విజయాలు అందుకొని వారు వేరే భాషకు వెళ్లి స్టార్స్ అయిన వారు ఉన్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అచ్చ తెలుగమ్మాయి గురించి.. సాధారణంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని సామెత అంటారు. కానీ, ఈ అమ్మాయి విషయంలో అది రివర్స్.. రచ్చ గెలిచి ఇంట గెలవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఎవరో కాదు తెనాలి బ్యూటీ శోభితా ధూళిపాళ్ల. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది.

2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 లో తొలిసారిగా నటించింది. ఈ సినిమా ఈ చిన్నదానికి మంచి విజయాన్నే తీసుకొచ్చి పెట్టింది. అలా బాలీవుడ్ లోనే పాగా వేసింది. ఇక తెలుగమ్మాయి అయినా కూడా తెలుగులో సినిమా చేయడానికి చాలా టైమ్ తీసుకుంది. అడివి శేష్ నటించిన గూఢచారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. కానీ, అమ్మడికి వరుస అవకాశాలను అందించలేకపోయింది. దీంతో శోభితా హిందీ, తెలుగు, తమిళ్ అంటూ తిరుగుతూనే ఉంది. ఇక ఈ మధ్య ఓటిటీ ఎంత ప్రభావం చూపుతుందో అందరికీ తెల్సిందే. ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ తో శోభితా మరింత పేరు తెచ్చుకుంది. అలా శోభితా తన టాలెంట్ తో హాలీవుడ్ వరకు వెళ్ళింది.

గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్, లయన్, ది మ్యాన్ వూ నో ఇన్ఫినిటీ, హోటల్ ముంబై, ది గ్రీన్ నైట్ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న దేవ్ పటేల్ హీరోగా నటిస్తున్న చిత్రం మంకీ మ్యాన్. ఈ చిత్రంలో శోభితా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇండియాలోనే జరిగింది. ముంబై లో ఈ మూవీ షూటింగ్ జరిగిందని తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో చాలా మంది బాలీవుడ్ నటులు నటించారు. కానీ, తెలుగమ్మాయి శోభితా హాలీవుడ్ సినిమాలో ఉండడం చాలా గ్రేట్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే అవంతిక వందనపు.. మీన్ గర్ల్స్ తో హాలీవుడ్ పేరు తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. అందులోనూ తెనాలి అమ్మాయి హాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది. ఇలా తెలుగమ్మాయిలు దేశాలు దాటి సత్తా చాటుతుంటే.. ఏం కిక్ ఉంది మావా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో శోభితా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version