NTV Telugu Site icon

Sobhita Dhulipala: నాగ చైతన్య రూమర్డ్ గాళ్ ఫ్రెండ్.. లిప్ లాక్ లకే పరిమితమా..?

Shobitha

Shobitha

Sobhita Dhulipala: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నది సామెత. కానీ.. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలవడానికి ప్రయత్నిస్తోంది. సాధారణంగా తెలుగు హీరోయిన్స్ ఎవరైనా ముందు టాలీవుడ్ లో సక్సెస్ అందుకున్నాక బాలీవుడ్ కు వెళ్లారు.. కానీ శోభిత మాత్రం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది. హిందీలో ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ అని చెప్పలేం కానీ.. హిట్ సినిమాల్లో నటించింది అని చెప్పొచ్చు. ఇక అడివి శేష్ నటించిన గూఢచారి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక రావడం రావడంతోనే అడివి శేష్ తో లిప్ లాక్ కు ఒప్పుకొనే షాక్ ఇచ్చింది. సరే బాలీవుడ్ నుంచి వచ్చింది కదా.. అలాగే ఉంటుందిలే అనుకున్నారు అభిమానులు.. ఇక ఈ సినిమా తరువాత అమ్మడు తెలుగులో మంచి అవకాశాలను అయితే రాబట్టుకోలేకపోయింది. కానీ, అక్కినేని నాగ చైతన్య తో శోభితా ప్రేమాయణం నడుపుతుందని టాక్ నడిచిన విషయం తెల్సిందే. ఈ ఒక్క రూమర్ అమ్మడిని మరింత ఫేమస్ చేసింది. సమంతతో విడిపోయిన చై.. శోభితతో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు రావడం, వాటిని ఆమె ఖండించడం కూడా జరిగాయి. కానీ, నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు.. వీరి మధ్య ఏం ఉన్నది అనేది వారికే తెలియాలి.

Kasturi: ఇంటింటి గృహలక్ష్మి హీరోయిన్ కు అస్వస్థత.. బుద్దిలేదు అని తిట్టిపోస్తున్న అభిమానులు

ఇక ఈ మధ్యనే ది నైట్ మేనేజర్ అనే సిరీస్ లో నటించి మెప్పించింది. ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో 70 ఏళ్ళ అనిల్ కపూర్ కు గాళ్ ఫ్రెండ్ గా శోభిత కనిపించింది. అతనితో లిప్ లాక్స్, మంచి రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఇంకోపక్క హీరో ఆదిత్య రాయ్ కపూర్ కు కూడా పెదవి చుంబనాలు బాగానే అందించింది. మొత్తానికి ఇద్దరు హీరోలకు సరిపడా న్యాయం చేసింది. అయితే ఆమె లిప్ లాక్స్ కు మాత్రమే పరిమితమా..? కంటెంట్ ఉన్న కథలో ఆమె పాత్ర ఏంటి..? ఇలాంటి పాత్రలే ఆమె చేస్తుందా..? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఆమె ఏమైనా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కానీ, ప్రాధాన్యం ఉన్న పాత్రలు కానీ చేస్తుందేమో చూడాలి.

Show comments